Jani Master: జానీ మాస్టర్ అరెస్ట్ .. పోలీసుల అధికారిక ప్రకటన
- జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసుల అధికారిక ప్రకటన
- 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతి పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు
- జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా పెట్టాం
- గోవాలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నాం
- రేపు కోర్టులో ప్రవేశపెడతాం: పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Police Release a Statement on Jani Master Arrest: జానీ మాస్టర్ అరెస్ట్ పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు. జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ పై రాయదుర్గం పీఎస్ లో నమోదైన కేసును నార్సింగ్ పీఎస్ లో రీ రిజిస్టర్ చేశాం అని బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశాం అని పోలీసులు పేర్కొన్నారు. 2020 లో తన అసిస్టెంట్ గా ఉన్న యువతిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని, అప్పుడు ఆమె మైనర్ అని పేర్కొన్నారు.
Jani Master: ఐదారేళ్లుగా లేనిది ఇప్పుడెందుకు? జానీ మాస్టర్ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్ సంచలనం
Also Read
ముంబై లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొన్న పోలీసులు మైనర్ మీద రేప్ కావడంతో జానీ మాస్టర్ పై పోక్సో కేసు కూడా పెట్టామని వెల్లడించారు. ఇక గాలింపు మొదలు పెట్టి జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. గోవా కోర్టులో ప్రవేశపెట్టి.. ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్ తీసుకొస్తున్నాం అని పేర్కొన్న పోలీసులు రేపు కోర్టులో ప్రవేశపెడతామని అన్నారు. జానీ బాషాపై పోక్సోతో పాటు రేప్ కేసులు నమోదు చేశామని పేర్కొన్న పోలీసులు ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశామని అన్నారు. మైనర్ గా ఉన్న సమయంలో అత్యాచారం చేసినందున పోక్సో సెక్షన్ యాడ్ చేశామని వెల్లడించారు. జానీ బాషా లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారంతో పాటు దాడికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.

తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!