జనసేన నాయకుల విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన పని లేదని కొట్టిపారేశారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలపై, కార్యక్రమాలపై బురద జల్లే పనిలో జనసేన ఉంది.. వారి విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ జనసేన కీలక ఆరోపణ చేసింది. నాసిరకం జగనన్న విద్యా కానుక కిట్లను ప్రెస్ మీట్లో నాదెండ్ల మనోహర్ ప్రదర్శించారు. ఇవాళ్టి నుంచి రోజుకో స్కీంలో జరిగిన కుంభకోణాన్ని బయట పెడతామని గతంలోనే జనసేన ప్రకటించింది.
ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ - జనసేన పార్టీల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.. 14, 15, 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.. నియోజకవర్గ స్థాయిలో ఉమ్మడిగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారు.. ఇక, ఈ నెల 17వ తేదీ నుంచి చేపట్టే ఇంటింటి ప్రచారంపై సమీక్ష చేపట్టనున్నారు నేతలు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ - జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీలో కీలక అంశాలపై నేతలు చర్చించారు. ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో తెలుగుదేశం - జనసేన పార్టీలు ప్రకటించాయి. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, అశోక్‌బాబు, పట్టాభి.. జనసేన నుంచి వరప్రసాద్, ముత్తా శశిధర్, శరత్‌కుమార్ ఉన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ స్పష్టమైన ప్రశ్నలతో ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆ రెండు పార్టీలు విలువలు విడిచిపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలను మభ్యపరిచి మోసగించడానికి చూస్తున్నాయని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జనసేన-టీడీపీలది అనైతిక పొత్తని అభివర్ణించారు. ఆంధ్రాలో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తామంటున్నాయని, తెలంగాణాకు వచ్చేసరికి జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతిస్తుంటే, మరి టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిస్తోందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్, పప్పు, నూనెల ధరలు పెరిగిన మాట వాస్తవమే.. కానీ, ధరలు పెరుగుదల ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నే కాదు దేశం అంతటా ఇదే పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు..