Purandeswari: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమాలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు. కడియం మండలం బుర్రి లంక ఇసుక ర్యాంపులను జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ తో కలిసి పరిశీలించారు పురంధేశ్వరి.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బుర్ర లంకలో ఇసుక ర్యాంపుల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాంపును పరిశీలించామని తెలిపారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.. నాలుగు ఐదు కిలో మీటర్ల మేర లారీలు క్యూ లైన్‌లో ప్రమాదకరంగా ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ఆగడాలకు కడియం నర్సరీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పర్యావరణ నిబంధనల ప్రకారం మిషనరీతో తవ్వకాలు జరుగుతున్నాయని.. దీనివల్ల ధవళేశ్వరం బ్యారేజ్ తో పాటు పర్యావరణానికి ముప్పు ఉందన్నారు. కంపెనీ పేరు లేకుండా బిల్స్ ఉన్నాయని, ఢిల్లీలో ఉన్న వారి పేరుతో ఇక్కడ తవ్వకాలు ఇల్లీగల్ గా జరుగుతున్నాయని ఆరోపించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను చుట్టేస్తున్న పురంధేశ్వరి.. ఓవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అసత్య ప్రచారాలు చేస్తోందని.. కేంద్రం నిధులు ఇస్తోందన్న మాటను కూడా దాస్తోందని కూడా మండిపడుతోన్న విషయం విదితమే.
Read Also: Guntur kaaram :పెరుగుతున్న ధమ్ మసాలా సాంగ్ క్రేజ్.. ప్లాన్ చేంజ్ చేసిన మేకర్స్..?