TS Elections: తెలంగాణలో తొలిసారిగా జనసేన తన బలాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ మూడో జాబితాపై కసరత్తు తుది దశకు చేరుకుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపుగా ముగిసింది.
టీడీపీ అంతర్గతంగా దివాళా తీసింది.. అందుకే రైల్వే క్షతగాత్రుల పరామర్శకు భువనేశ్వరి వెళ్తున్నారని విమర్శించారు. ఆమె టీడీపీ అధ్యక్షురాలు కానున్నారా? లోకేష్ ఏమయ్యాడు? ఎందుకు దూరం పెడుతున్నారు? అంటూ అనుమానం వ్యక్తం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
వైసీపీ పాలనలో అరాచకం పెచ్చుమీరుతోంది అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. హారన్ కొట్టడం కూడా నేరమే అని చట్టం చేస్తారేమో?.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అరాచకం అనే మాట తప్ప అభివృద్ధి అనే మాట ఎక్కడా వినిపించడం లేదు.. అధికార దుర్వినియోగం, అందుకు తోడైన అహంకారంతో వైసీపీలో ప్రతి స్థాయి నాయకుడు ప్రజల మీదా, ఉద్యోగుల మీదా జులుం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఇన్ చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వర్సెస్ శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ల మధ్య సవాళ్లు కొనసాగుతుంది. అయితే, కమ్మకోత్తుర్ లో రూరల్ సీఐ టీడీపీ నాయకులను బూతులు తిట్టి కొట్టడంతో తీవ్ర వివాదం అవుతుంది.
ఉమ్మడి జిల్లాల వారీగా రేపట్నుంచి టీడీపీ - జనసేన సమన్వయ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో సమన్వయ సమావేశాలు కొనసాగనున్నాయి. జిల్లాల్లో జరిగే సమన్వయ సమావేశాలకు పర్యవేక్షణ నిమిత్తం రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున సీనియర్ నేతలు హాజరు కానున్నారు.
Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ, ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా .. ఇప్పుడు మాజీ భార్యగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది.
జిల్లాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, ముఖ్య నేతలతో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు జరిగే జనసేన - టీడీపీ సమన్వయ సమావేశాలపై చర్చించారు.. ఉమ్మడి జిల్లాల వారీగా జరిగే ఈ సమన్వయ సమావేశాలను పార్టీ శ్రేణులు సీరియస్గా తీసుకోవాలవి సూచించారు
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.