టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరుగుతోంది. ఓ ప్రైవేట్ హోటల్లో ఇరు పార్టీలకు చెందిన జేఏసీ సభ్యులు సమావేశమయ్యారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతున్నట్లు తెలిసింది.
ఇవాళ టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం జరగనుంది. ఉదయం 11గంటలకు జేఏసీ సభ్యులు సమావేశం కానున్నారు. ఉమ్మడిగా పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది.
జనసేన పార్టీ తరపున తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బరిలో నిలిచే తన పార్టీ అభ్యర్థులను జనసేన మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేకు కేటాయించింది బీజేపీ.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా జనసేన విజయపథకం ఎగురవేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.
హైదరాబాద్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలనే అభిప్రాయానికి టీడీపీ-జనసేన పార్టీలు వచ్చాయి.
చంద్రబాబు- పవన్ మధ్య భేటీ కొనసాగుతుంది. తెలంగాణ ఎన్నికలు సహా ఏపీలోని తాజా రాజకీయాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. త్వరలో టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి విస్తృత స్థాయీ సమావేశాల నిర్వహాణపై ప్రస్తావనకు వచ్చే ఛాన్స్.. సీఐడీ పెడుతోన్న వరుస కేసుల పైనా కూడా ఇరువురు చర్చించే అవకాశం.