ముఖ్యమంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ పోటీచేసిన స్థానాల్లో గెలిచి.. టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో వారిని గెలిపిస్తే సీఎం పోస్ట్ అడగవచ్చు అన్నారు.. ఇక, మేం టీడీపీ వెనకాల నడవడం లేదు.. టీడీపీతో కలిసి నడుస్తున్నాం అన్నారు.
తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో చూశామన్న ఆయన.. ఏపీలో టీడీపీ, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారం కోసం కాదు ప్రతిపక్షం కోసం చంద్రబాబు జనసేనను కలుపు కున్నాడని.. ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నాడు.. ఎమ్మెల్యే కోసం పవన్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు…
నేడు విశాఖపట్నంలో ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ జరుగనుంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు చేరనునన్నారు. ఇక, మధ్యాహ్నం నగరానికి జనసేన చీఫ్ రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర సమస్యలు, తుఫాన్ నష్టం, రైతులు పడుతున్న ఇబ్బందులు, తాజా రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తారని పార్టీ వర్గాల వెల్లడించాయి.
తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్క స్థానంలోనూ పోటీ చేయలేదు.. కానీ, తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే టీడీపీ సంబరాలు చేసుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. ఇక, తెలంగాణ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదని.. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు అంటూ ఎద్దేవా చేశారు.
JanaSena Candidates lost deposits: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. సీపీఐతో కలిసి 65 స్థానాలను గెలుచుకొన్న కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. బీఆర్ఎస్ 39 సీట్లు గెలవగా.. బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. ఇక ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన జనసేన.. అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైంది. జనసేన అభ్యర్థులు అందరూ డిపాజిట్లు కోల్పోయారు. Also Read: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎవరు నిలబడరు అని ఆయన అన్నారు. తనకు బ్యానర్లు కట్టడానికి వచ్చిన వాళ్లను కూడా చంద్రబాబుకు బ్యానర్లు కట్టమని పంపిస్తున్నాడని పేర్కొన్నారు.
సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టం నాకు.. రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది నా ఉద్దేశం అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీ కండువా కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా.. వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తుచేశారు.
ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు నాలుగు జిల్లాలకు చెందిన వైసీపీ ముఖ్య నేతలు.. పార్టీ కార్యాలయంలో జనసేన కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కల్యాణ్.