వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కి అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇవాళ పవన్కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర యువగళం విజయోత్సవ సభ కోసం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి రావాల్సి ఉంది. అయినా లోకేష్ కార్యక్రమంలో పాల్గొనటానికి పవన్ విశాఖ బయల్దేరారు.
ఏపీలో జనసేన పార్టీకి మరో బిగ్షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన పలువురు కీలక నేతలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు.
Barrelakka Responds on comparision with Janasena: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపినా జనసేన పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు గాను కూకట్పల్లిలో చెప్పుకోదగిన స్థాయిలో ఓట్లు తప్పితే.. ఎక్కడా ప్రభావాన్ని చూపలేకపోయింది. అయితే ఇదే ఎన్నికల్లో పోటీ చేసిన యూట్యూబర్ బరెలక్క 5 వేలకు పైగా ఓట్లు సాధించడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్కకు పడినన్ని…
మన్యం జిల్లాలో సాగునీటి, తాగునీటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.. టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు అని ఆమె విమర్శలు చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పాలి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా దీవించాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు వివాదం ప్రస్తుతం ఏపీలో దుమారాన్ని రేపుతోంది. ఈ విషయంలో సినీ నటుడు, జనసేన నేత నాగబాబుపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆయన స్పందించారు. ఓటు వ్యవహారం వివాదమవుతుందనే ఉద్దేశంతోనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు.
రెండు ఓట్ల వివాదంలో జనసేన నేత నాగబాబు చిక్కుకున్నారు. ఇటీవల తెలంగాణలో నాగబాబు కుటుంబం ఓటు వేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఇటీవల నాగబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకి, కోడెల శివప్రాసాద్ నరసరావుపేట నుండి సత్తెనపల్లికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు.