Pawan Kalyan: యువత, మహిళా బలం వల్లే వైసీపీ లాంటి గూండా నేతలను ఎదుర్కొని జనసేన నిలబడగలుగుతోందని.. వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలంటే.. ఒక్కసారి జనసేనను నమ్మండి అంటూ పవన్ ప్రజలకు సూచించారు. ముస్లింలు మైనార్టీలు కాదు మెయిన్ స్ట్రీమ్ నాయకులు అంటూ ఆయన పేర్కొన్నారు. మైనార్టీలు ఇబ్బందుల్లో ఉంటే సాటి మనిషిగా అండగా నిలబడతానని.. మైనార్టీలను ఓట్ల కోణంలో చూసే మనిషిని కాదన్నారు. నేడు జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. విశాఖ, పి.గన్నవరం, దర్శి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు జనసేనలో చేరారు. పవన సమక్షంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన నేతలు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
Read Also: Botsa Satyanarayana: చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్
ఒక్క సీటు కూడా వైసీపీకు వెళ్లకుండా పని చేయాలని కార్యాకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. టీడీపీ-జనసేన పార్టీల పొత్తు కనీసం ఓ దశాబ్దం కాలం పాటు ఉండాలన్నారు. దశాబ్ద కాలంపాటు పొత్తు ఉంటేనే రాష్ట్ర విభజన నష్టాన్ని, వైసీపీ పాలన విధ్వంసం నుంచి ఏపీని కాపాడుకోగలమన్నారు. నా భవిష్యత్తు కోసం నేనేం చేయడం లేదన్న పవన్.. ఏపీ భవిష్యత్తు కోసమే కృషి చేస్తున్నానన్నారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.
Read Also: YSRCP MP Vijayasai Reddy: ఏపీలో ఓట్ల గందరగోళంపై ఫిర్యాదు చేశాం..
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” నేను దశాబ్దకాలంగా పని చేస్తున్నాను. పల్లం వైపే నీరు వెళ్తుంది.. పార్టీ కోసం కష్టపడితే గుర్తింపు దానంతట అదే వస్తుంది. ప్రజలు తప్ప నాయకులంతా బాగు పడుతున్నారు. నేతలు కాంట్రాక్టులు చేసుకుంటున్నారు.. దోపిడీ చేస్తున్నారు.. సంపాదిస్తున్నారు. మైనార్టీలు నన్ను నమ్మాలి.
రాజ్యాంగబద్దంగా ముస్లింలకు ఏం చేయాలో అవన్నీ చేస్తాను. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది.. దీనిని చక్క దిద్దాలి నేను అందరీ మతాలను గౌరవిస్తా. మిమ్మల్ని ఓటు బ్యాంకుగా ఎప్పుడూ చూడను. ముస్లిం మైనార్టీల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తాం. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అవకాశం ఇచ్చి చూడండి. బీజేపీ వల్ల ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముస్లింలకు అన్యాయం జరిగితే పవన్ ముస్లింల వైపే ఉంటాడు. ముస్లింల పక్షాన గళం ఎత్తే నాయకుడ్ని నేనే. ఉద్దానం తర్వాత ప్రకాశం జిల్లాలోనే ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలో వలసలు తగ్గించాలి. నీటి సమస్య, వలసలు తగ్గాలి, ఉపాధి అవకాశాలు పెంచాలి. రాష్ట్ర భవిష్యత్ కోసం కనీసం 10 ఏళ్లు పనిచేయాలి. సినిమా టిక్కెట్ల లాంటి విధానాలకు చీఫ్ సెక్రటరీలతో పని చేయించే పరిస్థితి ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చీఫ్ సెక్రటరీలు.. రెవెన్యూ అధికారులతో పని చేయించే పరిస్థితి తెస్తాం.” అని పవన్ పేర్కొన్నారు.