యువత, మహిళా బలం వల్లే వైసీపీ లాంటి గూండా నేతలను ఎదుర్కొని జనసేన నిలబడగలుగుతోందని.. వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలంటే.. ఒక్కసారి జనసేనను నమ్మండి అంటూ పవన్ ప్రజలకు సూచించారు.
ప్రభుత్వ నిర్ణయాల వల్ల 85,350 మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందంటూ ఫైర్ అయ్యారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సీబీఎస్ఈ విద్యార్థుల భవితవ్యంపై నాదెండ్ల సీరియస్ కామెంట్లు చేశారు.. ప్రభుత్వ తప్పిదాల వల్ల 85 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంను హోల్ సేల్‌గా అమ్మేయడం వైసీపీ ప్రారంభించిందన్న జనసేన పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ తీవ్రంగా మండిపడ్డారు. జనసేనలో పొలిటికల్ బ్రోకర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ అధినేత అజ్ఞాత వాసి అయితే, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అజ్ఞాని అంటూ ఆగ్రహించారు.
సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. గత నెల నవంబర్మూడో తేదీన జరిగిన కేబినెట్ భేటీలో కొన్ని కంపెనీలకు విచిత్రమైన ప్యాకేజీలు ప్రకటించారు. దుకాణం మూసేసే ముందు క్లియరెన్స్ సేల్స్ పెట్టినట్టు.. వైఎస్ జగన్ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల పేరుతో జగన్ క్లియరెన్స్ సేల్స్ మొదలు పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
రాష్ట్రంలో వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుపై టీడీపీ-జనసేన పార్టీలు చేసిన విమర్శలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు అవకాశాలను మెరుగుపరచడానికే మార్పులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ- జనసేన పార్టీలు ముందు వాళ్ళ ఇంటిని వాళ్ళు చక్కబెట్టుకోవాలి అని ఆయన చురకలంటించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కలలు కంటోందని.. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ జగన్ గెలుస్తాడు అని చెప్పరు ఓడితే మాత్రం అది జరుగుతుంది అంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని పోసాని ప్రశ్నించారు.
తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏపీ సీఎం జగన్ ప్రజల కోసం రెండు ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు మంత్రి సీదిరి అప్పలరాజు వెల్లడించారు. వైఎస్సార్ ఉద్దానం డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు.