Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు. ప్రస్తుతం ఆయన ఒకపక్క సినిమాలు ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పవర్ స్టార్ గా ఆయన రేంజ్ వేరు. ఒక్క సినిమా తీస్తే కోట్లు వస్తాయి. అయినా అలాంటి లగ్జరీ లైఫ్ వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
Somu Veerraju: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో పొత్తులపై ఆసక్తికర కామెంట్లు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇక, పవన్ కల్యాణ్ కామెంట్లపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కీలక వ్యాఖ్యలు చేశారు.. కృష్ణా జిల్లా గుడివాడలో జిల్లా స్థాయి భారతీయ జనతా పార్టీ బూత్ స్వశక్తి కిరణ్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన, తెలుగుదేశం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాటల దాడిని ఉద్ధృతం చేశారు వైసీపీ నేతలు. పవన్ మచిలీపట్నం సభపై కౌంటర్లు ఇస్తున్నారు. మచిలీపట్నం సభలో మాట్లాడిన పవన్ వచ్చే ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలిపశువు కాబోదని, తాము ప్రయోగాలు చేయబోమని స్పష్టంచేశారు.
జనసేనాని పవన్ కల్యాన్ మచిలీపట్నం సభపై మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దే అంటూ వ్యాఖ్యానించారు. తొడలుకొట్టాల్సిన అవసరం తమకేం లేదన్నారు. దుర్యోధనుడు, ధృతరాష్ట్రుళ్లు పవన్ పక్కనే ఉన్నారన్నారు.
Karumuri Nageswara Rao: జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవం వేదికగా పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావసభలో కులాల ప్రస్తావన గురించే పవన్ మాట్లాడారు.. కానీ, ఆ పార్టీకి దిశ.. దశ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడటమే పవన్ పని.. పార్టీ పొత్తులేదంటారు.. అన్ని సీట్లకు పోటీచేయనంటారు.. పార్టీ…
మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పదో ఆవిర్భావ సభ విజయవంతం పట్ల పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. విజయవాడ నుంచి మొదలైన వారాహి యాత్రను, మచిలీపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు పవన్.
తాను డబ్బులు కోసం ఆశపడే వ్యక్తిని కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.