జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ కులమో చెప్పుకోలేని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శించారు. అప్పుడేమో కాపు అన్నాడని, నిన్న ఏమో బీసీ అంటున్నాడని, చిరంజీవి పార్టీ పెట్టి ఓటమి చెందిన తర్వాత రోజే అన్నను వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్బై చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే.. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేయగా.. రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. మరోవైపు.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు బీసీ సదస్సు నిర్వహించారు.. అయితే, ఆ సదస్సులో పాల్గొన్నారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల.. ఉన్నట్టుండి ఆమె జనసేన సమావేశానికి రావడం చర్చగా మారింది.. త్వరలోనే కాండ్రు కమల…
JanaSena: జనసేన బీసీ కులాల ఐక్యత కోరుకుంటోంది.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంక్షేమంపై నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేషన్ల పేరుతో వైసీపీ బీసీ కులాలను విడదీస్తోందని విమర్శించారు.. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు స్టిక్కర్ అతికించుకోవడం తప్ప బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్న ఆయన.. స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవ పడటానికి…
Vellampalli Srinivas: 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ పనిబడతాం.. వాళ్లు ఏమీ పీకలేరు అంటూ ఘాటు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. విశాఖ గ్లోబల్ సదస్సు విజయవంతం అయిన నేపథ్యంలో విజయవాడలో సంబరాలు నిర్వహించారు.. కేక్ కట్ చేసి కార్యకర్తలతో విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు.. ఈ సెలబ్రేషన్స్ లో ఎమ్మెల్సీ రుహుల్లా, నగర మేయర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మార్చి 3, 4…