Rk Roja: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చుట్టేస్తూ.. తన అభిమాన సంఘాలనే కాకుండా ప్రజలను కూడా తనదైన మాటతీరుతో ఆకట్టుకోవడమే కాకుండా సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక నిన్నటికి నిన్న గాజువాకలో జరిగిన సభలో జగన్ పై పవన్ మరోసారి దుమ్మెత్తిపోశారు.
పార్టీ నడపడానికి సినిమాలే తనకు ఇంధనమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ఎన్ని వేషాలు వేసినా మీరు భరించాలిసింది ఆరు నెలలు మాత్రమేనని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. వారాహి ఎక్కి పవన్ పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. మంత్రి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. పవన్, చంద్రబాబు ఇద్దరిలో అసహనం కనిపిస్తోందని పేర్కొన్నారు.