అవగాహానలేని చేతలు, మాటలు మాట్లాడే సెలబ్రెటీ అని పవన్ ను దుయ్యబట్టారు మంత్రి బొత్స సత్యనారాయణ. ముఖ్యమంత్రి, ప్రధాని మీద మాట్లాడి పెద్ద వాడైపోయానుకుంటున్నాడని ఆరోపించారు. అసలు నీ విధానం ఏంటి? పార్టీ ఏంటంటే సమాధానం లేదన్నారు మంత్రి. 15 ఏండ్లు అవుతుంది రాజకీయ దుకాణం తెరిచి.. ఆ దుకాణంలో ఏ వస్తువు లేదు, క్వాలిటీలేదని ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో గడపగడపకు విజయోత్సవ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే అమావాస్య( ఉగాది )నాటికి రెండు రాజకీయ పార్టీలు ఉండవని తెలిపారు. తెలుగుదేశం, జనసేన ఉండవని.. ఉంటే గుండు గీయించుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ను పవన్ కల్యాణ్ ఏమీ పీకలేరని విమర్శించారు. పవన్ కల్యాణ్కు సత్తా ఉంటే సింగిల్గా రావాలి అని వెల్లంపల్లి శ్రీనివాసరావు సవాల్ చేశారు.
రుషికొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరికాసేపట్లో నోవాటల్ నుండి ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. ఆయన పర్యటన దృష్ట్యా.. రుషికొండకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు జోడిగుళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
విశాఖలోని జగదాంబ సెంటర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. సీఎం జగన్ రాజ్యాంగ విరుద్ధంగా జగన్ పనులు చేయిస్తున్నాడని విమర్శించారు. సింహద్రి సాక్షిగా చెప్తున్నాను.. వాలంటర్లు మీద ద్వేషము లేదన్నారు. వాలంటీర్లతో జగన్ తప్పులు చేయిస్తున్నాడని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకునే వారిని గద్దెనెక్కించారని.. తెలంగాణ రావడానికి జగన్ కారణమని పవన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. దేశంలో కాంగ్రెస్ ను చాయ్ వాలా మట్టికరిపించారని తెలిపారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని చాయ్ కప్ వాలా(పవన్ కళ్యాణ్) మట్టి కరిపిస్తారని సునీల్ దియోధర్ అన్నారు.
రాజకీయం అంటూ ఏంటీ అని చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా రాష్ట్రంలోని అందరికి అన్నీ అందిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు.