ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తర్వాత.. నిరుద్యోగులు రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు.. వారి ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తుండగా.. ఇప్పుడు జనసేన పార్టీ కూడా రంగంలోకి దిగింది.. నిరుద్యోగులకు అండగా జనసేన పోరాటం చేస్తుందని ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఈ నెల 20న అన్ని జిల్లాల్లోని ఎంప్లాయ్‌మెంట్ అధికారులకు వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు.. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని డిమాండ్ చేసిన జనసేనాని… లక్షల్లో ఉద్యోగాలు…
తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ సంజయ్ గారి ధృఢ చిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ ధృడ సంకల్పం కలిగిన నేతగా నిలిపాయి.…
తెలుగు అకాడెమీ పేరును మారుస్తూ ఏపీ సర్కారు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడెమీని కాస్తా.. తెలుగు సంస్కృత అకాడెమీగా మారుస్తున్నట్లుగా ఏపీ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీశ్ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలుగు అకాడెమీ పేరు మార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని ప్రశ్నించారు. వీలైతే సంస్కృత భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఓ అకాడెమీ ఏర్పాటు చేయాలని హితవు పలికారు.…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం హీట్ పెంచుతోంది… ఇరు రాష్ట్రాల మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్తూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో జల వివాదంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అమరావతిలో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్న పవన్.. ఇద్దరు…
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అందులో భాగంగా జనసేన పార్టీ కమిటీలను ప్రకటించారు. ఐదుగురిని ప్రధాన కార్యదర్శులుగా.. 17 మందిని కార్యదర్శులుగా.. 13 మందిని సంయుక్త కార్యదర్శులుగా నియమించారు.. ఇక, 9 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కూడా ప్రకటించారు జనసేనాని.. మరోవైపు.. ఐటీ, డాక్టర్స్, చేనేత, మత్స్యకారులు, లీగల్ విభాగాలను ఏర్పాటు చేసి.. వాటికి అధ్యక్షులను నియమించారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల పేర్లను పరిశీలిస్తే.. కృష్ణా జిల్లా –…
ఆంధ్రప్రదేశ్ కరోనా కోరలు చాస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి రోజు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఉభయగోదావరి జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజు రోజుకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వినియోగం పెరుగుతున్నది. దీంతో కోనసీమలో ఈరోజు నుంచి మూడు రోజులపాటు ఆక్సిజన్ ప్లాంట్ పార్టీ నిరసన దీక్షను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే, పోలీసులు ఈ నిరసన దీక్షకు అనుమతి…
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు అభియోగాలతో ఎంపీని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు సెలెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి…
కరోనా వైరస్ ఎవ్వరినీ వదలడంలేదు.. సామాన్యుల నుంచి వీఐపీల వరకు అంతా మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు.. తాజాగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు కూడా కరోనా వైరస్ సోకింది.. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర, బహిరంగసభలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత కాస్త నలతగా ఉండడంతో.. వైద్యుల సూచనల మేరకు కోవిడ్ టెస్ట్‌లు చేయించుకున్నారు.. అయితే,…