తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ సంజయ్ గారి ధృఢ చిత్తం, పోరాట పటిమ తెలంగాణలో ఆయనను రాజకీయ ధృడ సంకల్పం కలిగిన నేతగా నిలిపాయి. యువ కార్యకర్తగా రాజకీయరంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదిగిన శ్రీ సంజయ్ గారు తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీకి మరిన్ని సేవలు అందిస్తారన్న విశ్వాసం నాకుంది. ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నా తరఫున, జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాను’ అంటూ పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
