జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ మాట్లాడుతూ.. ‘సినిమాలంటే నాకు ఇష్టం.. నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి.. సినిమా పరిశ్రమను తక్కువ చేయడం లేదు.. కానీ, రాజకీయాల్లోకి నచ్చి వచ్చా.. నేను సినిమా హీరోను కాదు.. నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ, సాటి మనిషికి అన్యాయం జరిగితే.. స్పందించే గుణం నాలో ఉంది.. మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి.. ప్రజాస్వామ్య…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ మీటింగ్ ను నేడు నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘వైసీపీ గ్రామసింహాలు అంటూ ప్రసంగం పవన్ ప్రసంగం ప్రారంభించారు. గ్రామసింహాలంటే.. కొన్ని నిఘంటువుల ప్రకారం.. ఎక్కువ వాగి పళ్లు రాలగొట్టించుకొనే కుక్కలు అంటూ పవన్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలకు భయం అంటే నేర్పిస్తా.. కులాల చాటున దాక్కుంటే లాకొచ్చి కొడతా.. గుంటూరు బాపట్లలో పుట్టినవాడిని నాకు బూతులు రావా..? రాజకీయాల్లో…
బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో.. అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్నాయి.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. మరోసారి విజయంపై కన్నేసిన వైసీపీ.. బద్వేల్ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధా పేరును ఖరారు చేయగా.. మరోవైపు.. పరిషత్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓట్లను బట్టి.. గట్టి పోటీ ఇవ్వగలమనే ధీమాతో.. బై పోల్‌పై ప్రత్యేకంగా…
సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయం విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు.. ఈ నేపథ్యంలో పవన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒళ్లంతా బురద చల్లుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన.. తమ పాలిట గుదిబండ అయ్యారని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ పవన్ కల్యాణ్ గురించి…
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీ-జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సినిమా ఫంక్షన్లో పవర్ స్టార్ రెచ్చిపోతే, మీడియా ముందు వైసీపీ ప్రశ్నప్రశ్నకు కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. దీంతో పవర్ స్టార్ అభిమానులు, జనసైనికులు కూడా సోషల్ మీడియాలో యుద్ధాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. కాగా, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్ కల్యాణ్‌పై పదునైన విమర్శలు చేశారు. అయితే, సోషల్ మీడియా…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ సర్కార్, సీఎం, మంత్రులపై చేసిన కామెంట్లు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు మంత్రులు, వైసీపీ నేతలు.. తాజాగా సినీ దర్శకనిర్మాణ, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్ కల్యాణ్‌పై పదునైన విమర్శలు చేశారు. అయితే, సోషల్ మీడియా వేదికగా మంత్రి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్… వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. ఓ పద్యం రూపంలో… “తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు..…
ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. దీంతో, టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలి అన్నా జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి.…
పరిషత్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పర్వాలేదు అనే స్థాయిలో స్థానాలను కైవసం చేసుకుంది.. రాజమండ్రి ఎంపీ భరత్ దత్తత గ్రామంలోనూ సత్తాచాటిన జనసేన విజయం సాధించింది.. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ కౌంటర్ ఇచ్చారు ఎంపీ భరత్.. నా దత్తత గ్రామం పొట్టిలంకలో ఎంపీటీసీ ఓటమిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికావన్న ఆయన.. దత్తత తీసుకుంటే ఖచ్చితంగా గెలవాలని ఎలా చెప్పగలం.. అని ప్రశ్నించారు.. ఇక, జనసేన ప్రభావం ఆ గ్రామంలో…