జనసేన విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమలో చిచ్చు పెట్టారు. కుల ఘర్షణలు జరిగేలా రెచ్చగొడుతున్నారు. భారత దేశం కులవ్యవస్థతో ఏర్పాటైన సమాజం. స్వాతంత్రోద్యమం గుణ పరంగా జరిగింది కానీ.. ఎన్నికలనేవి కులపరంగానే జరుగుతున్నాయి. జనసేన కులాల ఐక్యత కోరుకునే పార్టీ. కుల విభజనతో రాజకీయాలు చేయకూడదన్నారు పవన్. రాజకీయాలను కొన్ని కులాలకే పరిమితం చేయకూడదు. కోనసీమలో వైసీపీ విచ్ఛిన్నకర రాజకీయం…
ఏపీలో తరచూ వినిపిస్తున్న పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వన్ సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక.. మిగిలిన విషయాలు మాట్లాడతాం.రాష్ట్రం కోసం నేను తగ్గడానికి సిద్దం. అన్నిసార్లు తగ్గాను.. ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాను. టీడీపీ కొంత తగ్గితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ సూచించారు. బీజేపీతో సంబంధాలు బాగున్నాయంటూ పవన్ స్పష్టీకరించారు. పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లపై చర్చిద్దామని…