Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ కొండగట్టుకు వెళ్లనున్నారు.. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి జగిత్యాల జిల్లా కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఆంజనేయస్వామి ఆలయంలో అక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపించనున్నారు పవన్… వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి పవన్ ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. సమావేశం అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక…
అన్నమయ్య ప్రాజెక్టు విషాదానికి ఏడాది గడిచింది.. ఈ ప్రాజెక్టు తెగిపోవడంతో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోగా.. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేట, నందలూరు మండలాల పరిధిలోని పులపత్తూరు, మందపల్లె, తొగూరుపేట, గుండ్లూరు, రామచంద్రాపురం గ్రామాలు తీవ్రంగా నష్టాన్ని చవిచూశాయి.. బాధితులు రోడ్డున పడ్డారు. అయితే, అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు సాయం అందించేందుకు జనసేన పార్టీ.. రేణిగుంటలో ఇవాళ మీడియాతో మాట్లాడిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. అన్నమయ్య…
నేడు పవన్ కల్యాణ్ పుట్టిరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన తమ్మడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తన ఆశ, ఆశయం ఎల్లప్పుడూ జనహితమే అని తెలిపారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అని పవన్తోఉన్న ఓ పాత ఫొటోను చిరు పోస్ట్ చేశారు. తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ…
భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. జనసేన ఆధ్వర్యంలో ఆయన జనవాణి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు స్థానికుల నుంచి వినతులను ఆయన స్వీకరిస్తున్నారు. https://www.youtube.com/watch?v=SHfMzjJ6Ebg
రాష్ట్రమంతా రాజకీయం ఒక తీరున ఉంటే.. ఈ మూడేళ్లలో రాజోలు పాలిటిక్స్ మాత్రం ప్రత్యేకం. రాష్ట్రంలో జనసేన గెలిచిన ఏకైక నియోజకవర్గం ఇదే. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చాలా వేగంగా వైసీపీకి జైకొట్టేశారు. అప్పటి నుంచి మూడేళ్లుగా రాజోలు వైసీపీ రాజకీయం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ఇంఛార్జులు మారిపోయారు. నేతల మధ్య సఖ్యత లేదు. ఒకరంటే ఒకరికి పడదు. ఈ గొడవల మధ్య ఇన్నాళ్లూ ఉగ్గబట్టి ఉన్న వైసీపీ నేతలు కొందరు.. ఇక ఇమడలేక గుడ్బై…
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం వైసిపి సంక్షోభంలో పడింది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు వైసిపిలో ప్రాధాన్యత ఇవ్వడం, నియోజకవర్గ వైసిపి శ్రేణులకు మింగుడు పడటంలేదు. వైసిపికి రాజోలు నియోజకవర్గంలో కో – ఆర్డినేటర్ గా పెదపాటి అమ్మాజీ, మాజీ కో – ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు లను ప్రక్కన పెట్టి ఎమ్మెల్యే రాపాకకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో వైసిపి ఆవిర్భావం నుంచి ఉన్న నేతలు డీలా పడ్డారు. ఇటీవల అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా…
మత్య్సకారులు కోసం రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. పవన్ అభిమానులు ఆయనను చూడడానికి, సభలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో సభకు వచ్చారు. కారులోనే అభివందనం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారుపైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ…