Deputy CM Pawan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్ తో తన ప్రయాణం మొదలైన రోజును మంత్రి నాదెండ్ల మనోహర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా 2018 అక్టోబర్ 12వ తేదీన ప్రారంభమైన ప్రయాణం జనసేనతో నా రాజకీయ ఆరంభం అంటూ అప్పటి ఫోటోను షేర్ చేశారు.
Gudivada Amarnath: కూటమి ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రభుత్వ కార్యాలయాల దండుకుంటున్నారో చెబుతూ బరితెగించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తాజాగా అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే వారికి మందు తాగారా లేదా అని తెలుసుకునేందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి, ముఖ్యంగా బాలకృష్ణకు నిర్వహించాలన్నారు. చిరంజీవి అంటే బాలకృష్ణకి ఈర్ష, గతంలో చిరంజీవిని చాలా సార్లు అవమానించారన్నారు.. బాలకృష్ణకి చిరంజీవికి అసలు పోలికే లేదని.. చిరంజీవి స్వయంకృషితో ఎదిగిన…
Pawan Kalyan: హైదరాబాద్ వరద బాధితులకు అండగా నిలవండి అంటూ జనసేన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ముఖ్యంగా వికారాబాద్, హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది.. ఓల్డ్ సిటీ, పురానాపూల్, ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్.. ఇలా మూసీ నది పరివాక ప్రాంతాలను వరదనీరు ముంచెత్తుతోంది.. ఈ నేపథ్యంలో.. జనసేన నేతలకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్..…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి రికార్డ్ ధరకు వేలం పాటలో అమ్ముడుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో జరిగిన ఈ వేలంపాటలో టికెట్ ఏకంగా రూ.1,29,999కు పలికింది. ఈ టికెట్‌ను పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ అభిమాని అయిన ఆముదాల పరమేష్ దక్కించుకున్నారు. టికెట్ నుంచి వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి ఇవ్వనున్నట్లు పరమేష్ తెలిపారు. Also…
శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిని నియమించింది కూటమి ప్రభుత్వం.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొన్న సాయిని.. అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బలు కొట్టి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.. సాయిని కొట్టిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్ కల్యాణ్. తాజాగా మంగళగిరిలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సినిమాలో ఔరంగజేబు లాంటి క్రూరత్వాన్ని తట్టుకుని ఒక హిందూ ధర్మకర్త ఎలా పోరాడాడు అనేది చూపించాం. హిందువుగా బతకాలంటే శిస్తు కట్టాలి అన్నప్పుడే తిరగబడటమే మన ముందున్న న్యాయం అన్నది ఇందులో ధర్మం. నేను డిప్యూటీ సీఎంగా ఉండి…
HHVM : పవన్ కల్యాణ్ వీరమల్లు ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. తాజాగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకు చాలా ప్రత్యేకత ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చూడని విధంగా మూవీ ఉండబోతోంది. కోహినూర్ వజ్రాన్ని కాపాడే ధర్మకర్త పాత్రలో నేను నటించాను. ఎందుకో నాకు ఇది చాలా హైలెట్ పాయింట్…
HHVM : పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంటున్నారు. నిన్న ప్రెస్ మీట్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవన్.. తాజాగా మంగళగిరిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో వీరమల్లు ఆలస్యానికి కారణాలను వెల్లడించారు. మేం వీరమల్లును అనుకున్నప్పుడు చాలా హై మూమెంట్ తో చేశాం. ఈ మూవీ కోసం చాలా మంది యాక్టర్లను తీసుకున్నాం. విదేశీ నటులు…
Pawan Kalyan : పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను నిర్మాతగా కొనసాగనున్నట్టు తెలిపారు. ఆయన నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చేస్తారా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించగా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో చాలా…