జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35ఏ ఎత్తేసిన తర్వాత ఉగ్రవాద కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయి. ఎప్పటికప్పుడు లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్, ది రెసిస్టెంట్ ఫోర్స్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటేందుకు ప్రయత్నిస్తున్నా… భద్రతా బలగాలు వరసగా ఎన్ కౌంటర్లు చేసి ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి. సరిహద్దుల వెంబడి పాక్ నుంచి వచ్చే ఉగ్రవాదుల సంఖ్య చాలా వరకు తగ్గింది. భద్రతా బలగాలు సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతో చాలా వరకు…
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఢిల్లీ-అమృత్ సర్-కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్…
ఢిల్లీలో పాక్ ఉగ్రవాదిని స్పెషల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ దృవపత్రాలతో ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో నివశిస్తున్నాడు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో స్పెషల్ సెల్ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్టు విచారణలో తేలింది. ఈ ఉగ్రవాది నుంచి ఏకే 47, పిస్టల్ తో పాటుగా హ్యాండ్ గ్రెనైడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, జమ్మూకాశ్మీర్‌లోని సోఫియాన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో…
బీజేపీ రాజ్యసభ సభ్యులు జి.వి.ఎల్. నరసింహారావు మాట్లాడుతూ… కాశ్మీర్ లో ఇప్పటివరకు 18 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. జమ్మూ-కాశ్మీర్ పునర్విభజన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతం గా మారిపోయున జమ్మూ-కాశ్మీర్ లో ప్రజల మనోభావాలను స్వయంగా తెలుసుకోవాలనే ఉత్సుకతే ఈ పరిణామానికి ప్రధాన కారణం. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేసేందుకు పార్లమెంట్ సభ్యులు దీనిని ఒక అవకాశం గా తీసుకుంటున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియగానే, వరుసగా ఇప్పటివరకు 18 పార్లమెంటరీ స్టాండింగ్…
ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల ప్రభావం జమ్మూకాశ్మీర్ సహా భారత్ పై అంతగా ఉండదు అని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం రుద్రారంలో ప్రైవేట్ యూనివర్సిటీ లో సెమినార్ కు హాజరైన ఒమర్ ఈ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశంలోకి చొరబాటుదారుల సంఖ్య బాగా తగ్గింది, దేశ సరిహద్దులు పటిష్టంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు మెరుగుపరిచేందుకు రెండేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజాభీష్టానికి విరుద్ధంగా జమ్మూకాశ్మీర్ ను…
ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దీంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతున్నది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నిబంధనలు సడలించారు. అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు. Read: హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్ వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చినా,…
కేంద్ర పాలిత ప్రాంతంగానే ఎన్నికలు, కాశ్మీర్‌పై బిజెపి వ్యూహంజమ్మూకాశ్మీర్కు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం రకరకాల కథనాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. 2019 ఆగష్టు5న హఠాత్తుగా నాటకీయంగా కాశ్మీర్ ప్రతిపత్తికి సంబంధించిన 370వ అధికరణాన్ని పక్కన పెట్టడం, లడక్‌ను విడదీసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం జరిగాక ఒక రాజకీయ ప్రక్రియ చర్చలు అంటూ జరగడం ఇదే మొదటిసారి.ఈ సమావేశం ఒక ఎత్తుగడ మాత్రమేనని రాష్ట్రంలోని రాజకీయ శక్తులన్నిటినీ రప్పించడం కేంద్రానికి విజయమని…
జమ్మూకాశ్మీర్ కొన్ని రోజులుగా ఉగ్రవాదులు పెట్రేగి పోతున్నారు. ముఖ్యంగా భద్రత దళాలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు ఈ నేపథ్యంలో తాజాగా మరో దాడికి ఉగ్రవాదులు ఒడిగట్టారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ లో సిఆర్పిఎఫ్ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై గ్రానైట్ రాళ్లతో దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు మరణించారు. మరో పోలీసు, ముగ్గురు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్ తోయిబా…