Pakistan: పాకిస్తాన్ మరింత దిగువ స్థాయికి చేరుకుంటోంది. సొంత దేశ పౌరుల్ని కూడా సరిహద్దు దాటి రానివ్వడం లేదు. ఇండియా నుంచి స్వదేశమైన పాకిస్తాన్ వెళ్తున్న పౌరుల్ని రానీవ్వడం లేదు. దీంతో అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి పాకిస్తాన్ తన రీసీవింగ్ కౌంటర్లను మూసేసిందని భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు ధ్రువీకరించారు. దీని ఫలితంగా చాలా మంది పాకిస్తాన్ జాతీయులు సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. Read Also: Pahalgam…
Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘ది రెసిస్టె్న్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది. అయితే, పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులే, 2024లో జరిగిన Z-మోర్హ్ టన్నెల్ ప్రాజెక్ట్‌పై దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రవాద ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులను పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ దాడికి రెండు రోజుల ముందు ఉగ్రవాదులు బైసరన్ లోయలో రెక్కీ చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడితో సంబంధం ఉన్న, ఉగ్రవాదులకు సహకరించిన ఒవర్ గ్రౌండ్ వర్కర్లలో (OGW) ఒకరిని విచారిస్తున్నప్పుడు ఈ విషయం వెల్లడైంది.
Supreme Court: జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైంది. ఈ ఘటనకు పాల్పడింది తామే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ప్రకటించింది.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మంగళవారం జరిగిన అత్యున్నత భేటీలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతీకారం కోసం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. బుధవారం కూడా ప్రధాని వరస మీటింగ్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే, భారత్ సైనిక చర్యకు ప్లాన్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, భారత్ ఎలా, ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తుందో అని దాయాది దేశం పాకిస్తాన్ హడలి…
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. భారత్ ఎప్పుడు, ఎలా, ఎక్కడ విరుచుకుపడుతుందో తెలియక ఆ దేశం భయాందోళనలో ఉంది. బయటకు భారత్‌ని తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఈ ఘర్షణ ముగించేందుకు పాక్ అంతర్జాతీయ సాయాన్ని కోరుతోంది. తటస్థ, పారదర్శక విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రకటిస్తోంది.
Pakistan: 26 మంది అమాయకపు టూరిస్టుల్ని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే దౌత్యపరంగా భారత్ పాకిస్తాన్‌కి షాక్‌లు ఇస్తోంది. పాక్ ప్రాణాధారమైన ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంది. పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసి, దేశంలో ఉంటున్న పాకిస్థానీలను వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌పై చర్యల విషయంలో భారత త్రివిధ దళాలకు ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛని ఇచ్చారు. టైమ్,…
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందని పలువురు పాకిస్తాన్ నేతలు చెబుతున్నారు. భారత్ దాడి చేస్తే తాము తీవ్రంగా స్పందిస్తామని చెబుతూనే, పాకిస్తాన్ యుద్ధాన్ని నిలురించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. మంగళవారం, ప్రధాని మోడీ అధ్యక్షత జరిగిన అత్యున్నత సమావేశంలో, త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు మృతి సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. క్యూలైన్ లో ఉన్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ పోలీసులు ఆస్పత్రికి తరలిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భక్తులు నిజరూప దర్శనం కోసం భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆ సమయంలో భారీ వాన కురిసింది. ఆ ధాటికి గోడ కూలి భక్తులపై పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే…
PM Modi: ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. వరసగా సమావేశాలతో ప్రధానితో సహా కేంద్ర మంత్రులు బిజీ బిజీగా ఉన్నారు. మంగళవారం, ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు – ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి,…