India Pakistan: బంగ్లాదేశ్‌లో పాక్ సైనిక అధికారులు.. బంగ్లా, మయన్మార్ సరిహద్దుల్లో హై అలర్ట్..
- బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దుల్లో హై అలర్ట్..
- బంగ్లాదేశ్‌లో పాక్ మిలిటరీ అధికారులు..
- అస్థిరతను సృష్టించేందుకు ఐఎస్ఐ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి భారత్, పాకిస్తాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత, యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. 26 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్రదాడిలో పాకిస్తాన్, లష్కరే తోయిబా ప్రమేయం ఉన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే, పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వస్తోంది.
Read Also: Pakistan: కవ్విస్తున్న పాకిస్తాన్.. రాజస్థాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్, ఆర్టిలరీ యూనిట్స్..
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
ఈమేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచార సంస్థ “ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్” (ఐఎస్ఐ) యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హై సర్వెలైన్స్‌లో నిఘా వర్గాలు ఉన్నాయి. బంగ్లా సరిహద్దుల్లో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి.
షేక్ హసీనా పదవిలో ఉన్నంత కాలం భారత్‌కి బంగ్లాదేశ్ అత్యంత మిత్రదేశంగా ఉంది. ఎప్పుడైతే, ఆ దేశంలో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పదవిలోకి వచ్చిందో అప్పటి నుంచి పాకిస్తాన్‌తో సంబంధాలను బలపరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే యూనస్ సర్కార్ పాక్ ఐఎస్ఐకి మద్దతు ఇస్తోందనే ఆరోపణ ఉంది. బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ సైనిక అధికారులుఉన్నట్లు భారత్ నిఘా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. రోహంగ్యా శరణార్థుల్ని ఉపయోగించి అస్థిర పరిచే ప్రయత్నాలకు తెరతీసింది. దీనికి తోడు బెంగాల్‌లో నకిలీ పాస్‌పోర్టులో ఉన్న పాక్ జాతీయుడిని అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. మరోవైపు, ఉగ్రవాదం,జాతీయ భద్రతతో రాజీపడేది లేదని కేంద్రం పునరుద్ఘాటించింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!