Delhi Blast Case: ఢిల్లీ పేలుళ్ల కేసులో మరో సంచలన అంశం బయటపడింది. ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సిద్ధిఖీ రెండు నెలల క్రితం లక్నోకు వెళ్లి అనేక మంది అనుమానాస్పద వ్యక్తులను కలిసిందని దర్యాప్తులో తేలింది. ఆమె పరిచయస్తులలో కొందరు అయోధ్య రామాలయాన్ని సైతం సందర్శించారని వర్గాలు చెబుతున్నాయి. లక్నోలో షాహీన్ ఎవర్ని కలిసింది? ఆమె ఎక్కడ బస చేసింది? అయోధ్యలో ఏదైనా కుట్ర జరిపారా..? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె లక్నోకు వచ్చినట్లు జమ్మూకశ్మీర్…
Jammu Kashmir: దక్షిణ కాశ్మీర్‌లోని కొకర్నాగ్ లోని దట్టమైన గడోల్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి ఎలైట్ 5 పారా యూనిట్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ కమాండోలు అదృశ్యమయ్యారు. దీంతో ఉమ్మడి భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పిపోయిన సిబ్బంది అగ్నివీర్ జవాన్లు అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల్న హతం చేయడానికి భద్రతా బలగాలు ‘‘ఆపరేషన్ మహదేవ్’’ నిర్వహిస్తోంది. తాజాగా, కుల్గాంలోని అకల్ దేవ్‌సర్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భారత సైన్యం, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ చేపట్టారు.
భారత సైనికులు, జమ్ముకాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ముమ్మరం చేయగా ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు.. అందులో ఓ ఆర్మీ ఆఫీసర్ కూడా ఉన్నారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్నాయి. దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులు, డ్రగ్స్ సరఫరాపై సమాచారం అందిస్తే భారీ నజరానా ఇస్తామని ప్రకటించారు. వీటిపై స్పష్టమైన సమాచారం అందించే వ్యక్తులకు రూ.1 లక్ష నుంచి రూ.12.5 లక్షల వరకు నగదు రివార్డులు ఇవ్వనున్నట్లు ఆదివారం పోలీసులు ప్రకటించారు. ఉగ్రవాదులు, ఆయుధాలు, నిషేధిత పదార్థాల రవాణా చేయడానికి దేశవ్యతిరేక శక్తులు ఉపయోగించే సరిహద్దుల్లోని సొరంగాల జాడ చెప్పిన వారికి రూ. 5 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
jammu kashmir DGP assassination: జమ్మూ కాశ్మీర్ లో దారుణం జరిగింది. రాష్ట్ర జైళ్ల శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియాను దారుణంగా హత్య చేశారు. సోమవారం జమ్మూలోని అతని నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. జమ్మూ శివార్లోని ఉదయ్ వాలా నివాసంలో గొంతు కోసి హత్య చేశారు. ఆ తరువాత తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శరీరంపై కాలిన గాయాలు ఉన్నాయి. అతని పనిపనిచే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.…
ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH)కి అనుబంధంగా ఉండి, వలసదారులను హతమార్చడంలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
2 Hizbul Terrorists Killed In Encounter in jammu kashmir: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులపై భద్రతా బలగాలు పైచేయి సాధించాయి. మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఇద్దరు కీలక ఉగ్రవాదులను హతమార్చాయి భద్రతా బలగాలు. అనంత్ నాగ్ జిల్లాలోని పోష్కేరీలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు హిజ్బుల్ ముజాహీద్దీన్ ఉగ్రవాదులు హతమయ్యారని కాశ్మీర్ పోలీసులు వెల్డించారు. పోష్కేరీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా…