నాసా తాజాగా ఓ ఫోటోను విడుదల చేసింది. ఇందులో అంతరిక్షంలో రెండు గెలాక్సీల కలయికను చూపిస్తున్నారు. ఒక గెలాక్సీ పెంగ్విన్ లాగా ఉంది. దాని కింద మరొకటి గుడ్డులా కనిపిస్తుంది.
NASA's James Webb Space Telescope Captures Never Before Seen Cosmic Clouds: నాసా ప్రయోగించిన జెమ్స్ వెబ్ టెలిస్కోప్ మరోసారి విశ్వానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాన్ని క్యాప్చర్ చేసింది. ఇప్పటికే విశ్వానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన ఫోటోలను తీసింది. బ్లాక్ హోల్స్, అనేక గెలాక్సీలను, నెబ్యులాలకు సంబంధించిన ఫోటోలను తీసి శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. తాజాగా జెమ్స్ వెబ్ మునుపెన్నడూ చూడని కాస్మిక్ మేఘాలను చిత్రీకరించింది. నారింజ, నీలిరంగు ధూళికి సంబంధించిన ఫోటోలను తీసింది.
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ కల్పన, అభూత కల్పనతో సాగుతూనే సైన్స్ కూ పెద్ద పీట వేస్తూ చిత్రాలు రూపొందిస్తూ ఉంటాడు. తాజాగా నాసాలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించిన విశ్వంలోని అద్భుతమైన ఫోటోలను ఇలా విడుదల చేయగానే, అలా క్రిస్టఫర్ నోలాన్ ను హాలీవుడ్ జనాలు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే, నోలాన్ తెరకెక్కించిన ‘ఇంటర్ స్టెల్లార్’లో కథ మొత్తం అంతరిక్షంలోని ఓ గ్రహం చుట్టూ తిరుగుతుంది. ఇది ఇలా ఉంటే క్రిస్టఫర్ సైతం…
అత్యంత ఖరీదు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవ ఇంజనీరింగ్, సైన్స్ అద్భుతం జెమ్స్ వెబ్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించి అద్భుత చిత్రాలను పంపిస్తోంది. కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీలు, నెబ్యులా, గ్రహాలకు సంబంధించి వివరాలను వెల్లడిస్తోంది. జెమ్స్ వెబ్ ను ప్రయోగించిన ఆరన్నర నెలల తర్వాత పనిచేయడం ప్రారంభించింది. హబుల్ టెలిస్కోప్ కన్నా కొన్ని వందల రెట్లు మెరుగైన జెమ్స్ వెబ్ విశ్వానికి సంబంధించిన రహస్యాలను చేధించే క్రమంలో ఉంది. భూమికి 15…