Jaishankar: భారత్- మాల్దీవులతో కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల మౌనం వీడారు. కాగా, నాగ్‌పూర్‌లో జరిగిన టౌన్‌హాల్ సమావేశంలో ఇటీవల మాల్దీవులతో విభేదాల గురించి జైశంకర్ ను అడిగిన ప్రశ్నకు.. ప్రతి దేశం మాకు మద్దతు ఇస్తారని నేను హామీ ఇవ్వలేను అని ఆయన తెలిపారు. మేము గత 10 సంవత్సరాలలో చాలా బలమైన సంబంధాలను ఏర్పాటు చేశాం.. రాజకీయ సంబంధాలలో హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ప్రజలలో సానుకూల భావాలను పెంపొందించడంపై దృష్టి సారించి ప్రపంచవ్యాప్తంగా బలమైన సంబంధాలను నిర్మించేందుకు గత దశాబ్ద కాలంగా ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు.
Read Also: Hyderabad: టీఎస్ఆర్టీసీ బస్సుపై పోకిరీల రాళ్లదాడి.. ప్రశ్నించిన డ్రైవర్, కండక్టర్‌పై కత్తితో..
ఇతర దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారత్ ప్రమేయం కూడా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం మా ప్రభుత్వం రోడ్లు, విద్యుత్తు, ట్రాన్స్మిషన్, ఇంధన సరఫరా, వాణిజ్య సదుపాయం, పెట్టుబడులతో పాటు ఇతర దేశాలలో పర్యటించేందుకు ప్రజలను అనుమతించామని ఆయన చెప్పారు. ఇక, అంతకుముందు.. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనను విమర్శిస్తూ ముగ్గురు మాల్దీవుల నేతలు ఆయనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడంతో భారత్, మాల్దీవుల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనతో మాల్దీవుల పర్యాటనను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో లక్షద్వీప్ తో పాటు ఇతర దేశీయ బీచ్ టూరిజంను ప్రోత్సహించాలనే పిలుపుకు భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పిలుపునిచ్చారు.