Jaishankar: అమెరికాలో జైశంకర్ పర్యటన.. ఆర్థిక సంబంధాలపై చర్చ
- అమెరికాలో జైశంకర్ పర్యటన
- మార్కో రూబియో, స్కాట్ బెసెంట్‌తో భేటీ
- ఆర్థిక సంబంధాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత ధృడమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రధాని మోడీ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత రెండు దేశాల మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్‌పై సుంకాన్ని 50 నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ట్రంప్ నుంచి ప్రకటన రాగానే ఇరు దేశాల మధ్య ఉల్లాసభరితమైన వాతావరణం ఏర్పడింది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ అయితే ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. పెట్టుబడిదారుల పంట పండింది. దాదాపు రూ.20 లక్షల కోట్ల సంపాదన జేబుల్లో పడింది.
ఇది కూడా చదవండి: Iran-US: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. ఇరాన్ డ్రోన్‌ను కూల్చేసిన అమెరికా
Also Read
- China: స్పేస్ వార్‌కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
- Trump-Iran: ఆ విషయంలో ‘పొరపాటు’ జరిగింది.. ట్రంప్ బృందానికి ఇరాన్ రహస్య సందేశం?
- Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 18 మంది తెలుగు టూరిస్ట్‌లు మృతి
ట్రంప్ దగ్గర నుంచి సానుకూల ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికాలో పర్యటిస్తూ వాణిజ్య చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లారు. అమెరికా ఉన్నతాధికారులను కలిసి రెండు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. మంగళవారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను జైశంకర్ కలిశారు. ఈ సందర్భంగా భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు.
జైశంకర్ ట్వీట్ చేస్తూ… ‘‘ఈరోజు వాషింగ్టన్ డీసీలో యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను కలవడం సంతోషంగా ఉంది. భారతదేశం – అమెరికా ఆర్థిక భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారం పురోగతిపై ఉపయోగకరమైన చర్చ జరిగింది..’’ అని రాసుకొచ్చారు.
‘‘అధ్యక్షుడు ట్రంప్-ప్రధాన మంత్రి మోడీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో- భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్వాగతించారు.. క్వాడ్ ద్వారా ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించుకోవడానికి తమ నిబద్ధతను వ్యక్తం చేస్తూ రూబియో- జైశంకర్ తమ సమావేశాన్ని ముగించారు. ఉమ్మడి ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కీలకమని వారు అంగీకరించారు.’’ అని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.
ఇదిలా ఉంటే రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపడానికి భారతదేశం కట్టుబడి ఉందని.. వాణిజ్య ఒప్పందం కింద అమెరికా నుంచి కొనుగోలు చేస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ లెవిట్ పేర్కొన్నారు.
US Department of State says, "… Secretary Rubio and Minister Jaishankar welcomed the trade deal reached between President Trump and Prime Minister Modi… Secretary Rubio and Minister Jaishankar concluded their meeting by expressing their commitment to expanding bilateral and… https://t.co/liG7WUKZn7 pic.twitter.com/c7AdcBC9Ax
— ANI (@ANI) February 3, 2026
#WATCH | Washington DC | External Affairs Minister Dr S Jaishankar meets US Secretary of State Marco Rubio pic.twitter.com/3AJifsFWDf
— ANI (@ANI) February 3, 2026
EAM Dr S Jaishankar tweets, "Pleased to meet US Treasury Secretary Scott Bessent in Washington DC today. Had a useful discussion on advancement of India – US economic partnership and strategic cooperation." pic.twitter.com/jdhjApD2wb
— ANI (@ANI) February 3, 2026
తాజావార్తలు
-
Thalliki Vandanam: తల్లికి వందనం లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఈ మూడు పనులు చేయకుంటే డబ్బులు రావు!
-
Omar Abdullah: రూ.30 కోట్లతో ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు.. బీజేపీపై జమ్మూకాశ్మీర్ సీఎం ఆరోపణలు
-
Monsoon 2026: దేశంలోని మాయమైన వర్ష మేఘాలు..రుతుపవనాలకు ఏమైంది?..
-
BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్‌లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
-
China: స్పేస్ వార్‌కు చైనా సై.. ఉపగ్రహాలను సైతం బూడిద చేసే ‘సరికొత్త ఆయుధం’ సిద్ధం! ఎలా పని చేస్తుందంటే..
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!