Team India: ఒకవైపు ఆటలో రాణిస్తున్నా జాతీయ జట్టులో స్థానం దక్కకపోతే ఏ ఆటగాడికైనా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా, దేశవాళీ టోర్నీలలో రాణిస్తున్నా ఎంతో కాలంగా జాతీయ జట్టులో స్థానం కోసం జయదేవ్ ఉనద్కట్ ఎదురుచూస్తున్నాడు. అయితే ఎట్టకేలకు అతడి నిరీక్షణ ఫలించింది. బంగ్లాదేశ్ పర్యటన కోసం ప్రకటించిన టెస్టు జట్టులో సభ్యుడు మహ్మద్ షమీ గాయం కారణంగా తప్పుకోవడంతో అనూహ్యంగా జయదేవ్ ఉనద్కట్‌కు సెలక్టర్ల నుంచి పిలుపు…