జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ... కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్‌ని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగా శ్రావణి 43 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ మూడో స్థానంలో నిలిచినప్పటికి... కొన్ని గ్రామాలు, జగిత్యాల పట్టణంలో ఆధిక్యత ప్రదర్శించడం కేడర్‌లో జోష్ నింపింది.
ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో ఊహించలేము. అప్పటి వరకు ఆనందం నిండిన చోట విషాదం నెలకొంటుంది. ఇదే రీతిలో తాజాగా ప్రమాదం కారణంగా ఓ పెళ్లి నిలిచిపోయింది. మరికాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకుతో పాటు ఆరుగురు తీవ్రంగా గాయపడగా ఓచిన్నారి మృతిచెందింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. Also Read:Chinnaswamy Stadium Stampede: మృతుల…
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఓ మహిళ కాల్ చేసిన ఘటన హాట్ టాపిక్ గా మారింది. గల్ఫ్ లో మంచి ఆఫర్ ఉందంటూ ఎమ్మెల్యేకు ఓ కన్సల్టెన్సీ మహిళ ఫోన్ చేసింది. నువ్వు ఎవ్వరికి ఫోన్ చేశావో తెలుసా అంటూ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదానికి దిగింది. మహిళ తీరుపై సదరు ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. లక్ష్మీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీపై సుమోటోగా కేసు నమోదు చేశారు…
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొడిమ్యాల మండల కేంద్రంలో ఆవుదుర్తి మమత(32) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిన స్థితిలో ఇంట్లో ఉన్న దూలానికి మృతదేహాం వేలాడుతోంది. ఇంటి చుట్టూ తాళాలు వేసి ఉన్నాయి. దుర్గంధం వెదజల్లడంతో పోలీసులకు సమాచారం అందించారు కాలనీవాసులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డోర్ ఓపెన్ చేశారు. 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం…
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రిమాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం పై చేసిన అసత్యపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2014 నుండి 2023 వరకు బి.ఆర్.ఎస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో ఎన్ని హామీలను అమలు చేశారో ఒక శ్వేత…
Posters in Jagtial: మంత్రగాళ్లూ తస్మాత్ జాగ్రత్త.. మాయమాటలు చెప్పే ప్రతి ఒక్కరినీ చంపేస్తాం.. అంటూ వాల్ పోస్టర్లు అంటించడం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కలకలం సృష్టించింది.
ఇడ్లీలో జెర్రీ ప్రత్యక్షమైన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ప్రముఖ గణేష్ భవన్ ఉడిపీ హోటల్‌లో ఓ కస్టమర్ ఇడ్లీ పిల్లలకు తినిపించే సమయంలో చనిపోయిన జెర్రీ కనిపించింది.
తమ కళని నమ్ముకుని ఎన్నో కలలు కంటూ సినిమా ఇండస్ట్రీలో రాణించాలని బోలెడన్ని ఆశలుతో వస్తారు. అలా వచ్చే వారి అవసరాన్ని అవకాశం గా మార్చుకుని బెదిరించి, భయపెట్టి తమ లైంగిక వాంఛలు తీర్చుకోవాలనుకునే ప్రబుద్ధులు ఎందరో ఉన్నారు. జాతీయ అవార్డు సైతం అందుకుని కామకోరిక తీర్చనందుకు ఓ యువతిని బెదిరించి అత్యాచారం చేసినందుకు నేడు కటకటాల వెనుక ఊచలు లెక్కేస్తున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తాజాగా ఇటివంటి ఉదంతమే జగిత్యాలలో జరిగింది. జగిత్యాలలో మరో…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల లోపు రైతు రుణాలన్నింటిని మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తాజాగా రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం కొనసాగుతోంది.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా నిర్వహించారు. రుణమాఫీ డబ్బులు రాలేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెనరా బ్యాంకులో 2,500 మంది ఖాతాలు ఉంటే 500 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందని 2 వేల మందికి రుణమాఫీ రాలేదని నిరసన వ్యక్తం చేశారు.