తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన వనపర్తి జిల్లా నుంచి మొదలు పెట్టనున్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. వేరుశనగ పరిశోధన కేంద్రం, కర్నె తండ ఎత్తిపోతల పథకం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్, రెండు పడకల గదులు ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 20న సోమవారం జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. జనగామలో కూడా…
కరోనా విశ్వమంతా కల్లోలం కలిగిస్తోంది. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్, వ్యాక్సిన్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా 127 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కానీ కొందరు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదు. జగిత్యాలలో కరోనా వ్యాక్సిన్ వేసుకోనంటూ ఓ వ్యక్తి హంగామా చేసిన వీడియో వైరల్ గా మారింది. READ ALSO:ఈ బామ్మలు సమ్‌థింగ్ స్పెషల్.. ఎందుకో తెలుసా? ఊరు వదిలైనా వెళ్తా కాని వ్యాక్సిన్ వేసుకోనంటూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.…
ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్టు చెబుతోంది. కానీ ఆచరణలో మాత్రం చాలా అధ్వానంగా ఈ సంస్థలు ఉన్నాయని అర్థమవుతోంది. జగిత్యాల జిల్లా బీసీ గురుకులంను చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. జిల్లాలోని కోరుట్ల గురుకులం నుంచి కూడా 380 విద్యార్థులను వారి తల్లిదండ్రలు తీసుకెళ్లారు. ఏం జరిగిందంటే..?ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళనకు…
జగిత్యాల పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీన్‌ఖని చౌరస్తా వద్ద ఓ టీ దుకాణంలో ఒక వర్గానికి చెందిన వారు… మరోవర్గంపై దాడికి పాల్పడ్డారు. ఓ విషయంలో ఇరు వర్గాలకు చెందిన వారు ఘర్షణకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల డీఎస్పీ ప్రకాష్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వ్యక్తులను వెంటనే సమీపంలోని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. Read Also:…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా కొన్ని జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి తెలిపిన సంగతి తెలిసిందే. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అలర్డ్‌గా ఉన్నారు. అయితే, రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని వెలుగుమట్ల గ్రామంలో ఇప్పటికే స్వచ్చందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. సోమవారంతో ఆ గ్రామంలో లాక్‌డౌన్ ముగిసింది. అయినప్పటికే కేసులు నమోదవుతుండటంతో పాటుగా సోమవారం రోజున కరోనాతో ఒకరు…