Digvijaya Singh: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలకు చెక్ పెట్టేందుకు హైకమాండ్ దూత దిగ్విజయ్ సింగ్ కొద్దిసేపటి క్రితం గాంధీభవన్ చేరుకున్నారు. గాంధీభవన్‌లో ఆయన పలువురు నేతలను వేర్వేరుగా కలుస్తున్నారు. దిగ్విజయ్ సింగ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఒక్కొక్కరుగా సమావేశం కానున్నారు. రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర నేతలకు దిగ్విజయ్ సింగ్ సమయం కేటాయించారు. అయితే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం నేతలు దిగ్విజయ్ సింగ్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
పార్టీలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలు, వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో చర్చించనున్నారు. నేతలంతా కలిసి నడవాలంటే ఏం చేయాలనే దానిపై వారి నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సీనియర్లను అవమానిస్తున్న వైనం, కొందరు నేతలు కోవర్టులుగా పనిచేసి పార్టీని దెబ్బతీస్తున్నారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ కూడా ఈ అంశంపై చర్చించనున్నారు.
Read also: Minister KTR: ఉపాధి హామీపై కేంద్రం దుష్ప్రచారం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కేటీఆర్ పిలుపు
అయితే.. నేతలతో చర్చించిన అనంతరం దిగ్విజయ్ సింగ్ ఈరోజు సాయంత్రం మీడియాతో మాట్లాడాలని భావించినా.. వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు దిగ్విజయ్ మీడియాతో మాట్లాడతారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ ఉదయం తాజ్ కృష్ణా హోటల్ లో దిగ్విజయ్ సింగ్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి కొంత సంయమనం పాటించారు. దిగ్విజయ్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. చర్చల తర్వాత టీ కాంగ్రెస్ పరిస్థితి మారుతుందని దిగ్విజయ్ అన్నారు. పార్టీలో నేతలంతా మాట్లాడుకునే పరిస్థితులు లేవన్నారు. తాను వివాదాల్లో చిక్కుకోనని చెప్పారు.
ఇక సీనియర్ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యులు వీ. హనుమంతరావు మాట్లాడుతూ.. డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చర్చించామన్నారు. పార్టీకి దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరికి తీసుకోవాలని చెప్పమని, అందరూ కలిసి పనిచేసేలా చొరవ తీసుకోవాలని తెలిపామన్నారు. అందరినీ సంప్రదించి కమిటీ వేస్తే పంచాయతీ వచ్చేది కాదన్నారు. మునుగోడు హుజురాబాద్ ఎన్నికల ఓటమిపై సమీక్ష లేదని తెలిపారు. కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని కమిటీలను తీసేయమని చెప్పలేదన్నారు. పీసీసీ కుర్చీ ఖాళీగా లేదు దానికోసం ఎవరు కొట్లాడటం లేదని స్పష్టం చేశారు. దిగ్విజయ్ సింగ్ చొరవతో పార్టీకి మేలు జరుగుతుందని తెలిపారు. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి రావాలని కోరారు వీ. హనుమంతరావు.
Minister KTR: ఉపాధి హామీపై కేంద్రం దుష్ప్రచారం.. రేపు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కేటీఆర్ పిలుపు