Congress agitation in Telangana: కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్ ఆఫీస్‌ను సీజ్ చేయడంపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతల నిరసనలు ఉద్రిక్తంగా మారింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈనేపథ్యంలో.. గాంధీభవన వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీభవన్ నందు భారీకేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. పార్టీ నాయకులు బయటికి పోకుండా పోలీసులు అడ్డుకున్నారు.
నిజమాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని యువజన కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకోల్లే ప్రయత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ గేట్లకు కాంగ్రెస్ జెండాలు కాంగ్రెస్ శ్రేణులు కట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్తితి ఉద్రిక్తంగా మారడంతో.. యూత్ కాంగ్రెస్ నేతల అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సునీల్ కనుగోల్ వార్ రూమ్ సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు.
Read also: Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. తొలిస్థానం ఎవరిదంటే..?
నల్లగొండ జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో సీఎం ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు దహనం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నిరసన కారులను అదుపులో తీసుకున్నారు. దీంతో నాయకులు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్దం చేసి, డౌన్ డౌన అంటూ నినాదాలు చేశారు.
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఆందోళన మిన్నంటాయి. ఇందిరా చౌక్ లో రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఇందిరాగాంధీ చౌరస్తాలో ధర్నా చేపట్టారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
అయితే.. పోలీసులు అదుపులో తీసుకున్న వారి కోసం కోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేతలు పోలీసుల అదుపులో ఉన్న వారి జాడ చెప్పాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ముగ్గురి కోసం హాబీస్ కార్పస్ పిటిషన్ ను మాజీ ఎంపీ మల్లు రవి దాఖలు చేశారు.
కనీస సమాచారం లేకుండా ముగ్గురిని పట్టుకెళ్లాలరని పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న వారిని వదిలిపెట్టేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 41 సిఆర్.పిసి కింద నోటీసులు ఇచ్చి సైబర్ క్రైమ్ పోలీసులు వదిలి వేస్తున్నట్లు సమాచారం.