ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ లేఖ రాశారు. పెంచిన విద్యుత్ ఛార్టీల కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, వారిపై మోయలేని భారం పడిందని నారా లోకేష్ లేఖలో పేర్కొన్నారు. ట్రూఅప్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన విద్యుత్ రంగాన్ని అత్యవసరంగా గాడిన పెట్టాలని, సీఎం ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు కరెంట్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రతీ సభలో చెప్పారని లేఖలో పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో…
తిరుపతిలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి తిరుపతికి చేరుకున్నారు. అనంతరం సీఎం జగన్ బర్డ్‌లో శ్రీ పద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆ తరువాత అలిపిరి వద్ధ శ్రీవారి పాదాల వద్ద నుంచి నడక మార్గంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైకప్పును, గో మందిరాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. తిరుమలకు చేరుకున్న తరువాత సీఎం బేడి…
తాడేపల్లిలో సిఎం వైఎస్ జగన్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. జాబ్ క్యాలెండర్‌కు నిరసనగా విద్యార్ధి సంఘాలు ఛలో తాడేపల్లి కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇంటిని ముట్టడికి విద్యార్ధి సంఘాలు ప్రయత్నం చేశాయి. సీఎం వైఎస్ జగన్ నివాసం వైపు వెళ్లేందుకు టీఎన్ఎస్ఎఫ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్యకర్తలకు మద్య తోపులాట జరగింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, సీఎం నివాసం వద్ద పోలీసులు భారీగా…
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కరించేందుకు కేంద్రం ముందడుగు వేసింది. కృష్ణా, గోదావరి జలాలకు సంబందించిన అన్ని విషయాలు బోర్డులే చూసుకుంటాయని చెప్పి గెజిట్‌ను విడుదల చేసింది. ఈ గెజిట్ అక్టోబర్ 14 వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలియజేసింది. గెజిట్ నోటిఫికేషన్‌ను ఆంధ్రనేతలు ఆహ్వానిస్తుంటే, తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు జలాల విషయాన్ని బోర్డులకు అప్పగించడంపై మండిపడుతున్నారు. Read: రాజమౌళి చేతుల మీదుగా “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్…
తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయాలని బ్రిటీష్ వారసులుగా పాలకులు వ్యవహరిస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ విషయం ఇప్పటికే కోర్టులో ఉంది. తెలుగు అకాడమీ ని రద్దు చేసి ఖునీ చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నాం. భారత ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలుగులో చదువుకొని వచ్చినవారే. తెలంగాణ, ఏపీ తీసుకుంటున్న నిర్ణయాల తో అన్యాయం జరుగుతోంది. తెలంగాణ నష్టం జరిగే నిర్ణయాలు తీసుకుంటే సీఎం చేతకాని తనంతో ఉన్నారు. రాయలసీమ…
100 సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికీ ఎలాంటి ఆపదా రాకూడదని మనసారా కోరుకునే ప్రభుత్వం మనది అని అన్నారు సీఎం జగన్. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారిని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకు వచ్చాం. అలాగే ఆరోగ్యశ్రీ కింద అందే చికిత్సల సంఖ్యను పెంచాం. నా పాదయాత్రలో అనేక కథలు విన్నాను, చూశాను కూడా. అందుకే మేనిఫోస్టోలో ఈ అంశాన్ని పెట్టాం అని పేర్కొన్నారు. దాదాపు 1.30 లక్షల కుటుంబాలు వైయస్సార్ భీమా పరిధిలోకి…
వైఎస్ఆర్ భీమా పథకాన్ని ఈరోజు తాడెపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ ప్రారంభించారు. రాష్ట్రంలో కుటుంబపెద్దను కోల్పోయిన వారికి అండగా ఉండేందుకు ఈ పథకాన్ని ప్రారంభించినట్టు జగన్ తెలిపారు. 2021-22 సంవత్సరానికి రూ.750 కోట్ల రూపాయలతో భీమా రక్షణ కల్పిస్తున్నట్టు వైఎస్ పేర్కొన్నారు. పేదలపై ఎలాంటి భారం పడకుండా భీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు జగన్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే ఈ పథకాన్ని అమలుచేస్తున్నామని తెలిపారు. కుటుంబ పెద్ద చనిపోతే, ఆ కుటుంబానికి భీమాతో…
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం దిశాయాప్‌ను రూపోందించింది. ఈ యాప్ ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. కృష్ణాజిల్లాలోని గొల్లపూడిలో దిశాయాప్ ప్రచార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం రూపోందించిన ఈ యాప్ నాలుగు అవార్డులు గెలుచుకుందని, ప్రతి మహిళ దిశాయాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. Read: ఆ జిల్లాలో సెల్ఫీలు నిషేదం… అతిక్రమిస్తే జైలు శిక్ష… దిశాయాప్‌పై ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని తెలిపారు.…