ఇవాళ జరిగిన ఏపీ కేబినేట్ మీటింగ్‌లో చర్చించిన అంశాలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలపై కెబినెట్లో ఎందుకు చర్చించ లేదు..? మాదకద్రవ్యాలు, గంజాయి ప్రస్తావన రాగానే దేశమంతా ఏపీ పేరే వినిపిస్తుంటే, కేబినేట్‌కు మాత్రం వినపడలేదన్నారు. ? లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఎయిడెడ్ విద్యాసంస్థలపై మంత్రివర్గం ఎందుకు చర్చించలేదు..? విశాఖలో స్వామీజీ ఆశ్రమానికి రైతులభూములు తక్కువ ధరకు అప్పగించడానికే ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించిందా?…
బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఉప ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. పోలింగ్ కు 72 గంటల ముందు నుంచే ఈ ప్రచారాలు ముగియడంతో మైకులు మూగబోయాయి. అయితే ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామారాజు, ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ.. బద్వేల్ నియోకవర్గంలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ పోలింగ్…
ఇప్పటికీ ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. గత పది రోజులుగా ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏలూరు స్మార్ట్ సిటీ చైర్మన్ గా బొద్దాని అఖిల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్ళిపోయాడని, గద్దె దిగిపోతూ దిగిపోతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేసాడంటూ ఆరోపణలు…
కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. కుటుంబాలు అల్లకల్లోలం అయ్యాయి. జీవానాధారం అయిన వారు కన్నుమూయడంతో సంపాదన లేక అల్లాడిపోయాయి లక్షలాది కుటుంబాలు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురుచూశాయి కుటుంబాలు. కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌లో అన్ని…
ఏపీలో రాజకీయ దుమారం రేపిన టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మరో ఏడుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. టీడీపీ కార్యాలయం ఘటనపై ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే.. చంద్రబాబు ఏపీకి సీబీఐ, కేంద్ర బలగాలు రావద్దంటూ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు ఎలా అడుగుతున్నారని వైసీపీ శ్రేణులు…
ములుగు జిల్లా టేకుల గూడ అడవి ప్రాంతంలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ లేఖ ద్వారా పేర్కొన్నారు. తెలంగాణ పోలీసులకు ఒక ద్రోహి సమాచారం ఇవ్వడం వలన ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని లేఖలో వివరించారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని జగన్ లేఖలో వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలను చంపడమే కాకుండా తన పాలన గొప్పగా ఉందని తెలపడం కోసం ప్లీనరీని నిర్వహించి, తమ…
ఆంధ్రుల పాలిట వరం పోలవరం విషయంలో కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే ఇచ్చిన నిధుల్లోనూ కేంద్రం కోత పెడుతుండడం అసహనం పెంచుతోంది. విద్యుత్కేంద్రం తవ్వకం పనులకు గతంలో ఇచ్చిన రూ.168 కోట్లు మినహాయించుకుంటామని కేంద్రం తెలిపిందని తెలుస్తోంది. పోలవరం దగ్గర 960 మెగావాట్ల విద్యుత్కేంద్రం పనులు చురుకుగా సాగుతున్నాయి. దీని నిర్మాణానికి రూ.4,560.91 కోట్లను డీపీఆర్ నుంచి ఇప్పటికే మినహాయించినట్లు కేంద్రం పేర్కొంది. విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని రాష్ట్రం అడగడం లేదు. విద్యుత్కేంద్రానికి…
ఏపీలో రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గాడి తప్పిందని ఆయన అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందని, అప్పులు తీసుకువస్తే తప్పా రాష్ట్రానికి మనుగడలేని దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగి సామాన్యుడికి అందని ద్రాక్షలా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం తిరోగమన చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన జగన్…
ఏపీలోని పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఏపీ దివాళా తీసింది. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా అభివృద్ధి లేదు. ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పమంటే ఒక్క మంత్రీ సమాధానం చెప్పడం లేదు. అప్పులిస్తే తప్పించి జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మంత్రులందరూ డమ్మీలు. సీఎంకి సజ్జల వాయిస్. అన్ని శాఖలకి…
విజయనగరం వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జిల్లా పరిషత్ లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అనిల్ మృతి పట్ల జిల్లా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడైన అంబటి అనిల్ మృతి పట్ల వైసీపీ…