100 సంవత్సరాలు బతకాలని, ఏ ఒక్కరికీ ఎలాంటి ఆపదా రాకూడదని మనసారా కోరుకునే ప్రభుత్వం మనది అని అన్నారు సీఎం జగన్. 5 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న వారిని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకు వచ్చాం. అలాగే ఆరోగ్యశ్రీ కింద అందే చికిత్సల సంఖ్యను పెంచాం. నా పాదయాత్రలో అనేక కథలు విన్నాను, చూశాను కూడా. అందుకే మేనిఫోస్టోలో ఈ అంశాన్ని పెట్టాం అని పేర్కొన్నారు. దాదాపు 1.30 లక్షల కుటుంబాలు వైయస్సార్ భీమా పరిధిలోకి వచ్చాయి. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని ఇన్సూరెన్స్ కవర్‌లోకి తీసుకు వస్తున్నాం. పేద కుటుంబాలమీద ఒక్కరూపాయి కూడా భారం పడకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది అని తెలిపారు.
ఇక 18 నుంచి 50 ఏళ్లలోపు సహజమరణం వస్తే రూ.1లక్ష రూపాయలు ఇస్తున్నాం. 18 నుంచి 70 ఏళ్లలోపై ప్రమాదశాత్తూ మరణిస్తే.. రూ. 5 లక్షలు పరిహారం. 2020–2021 సంవత్సరానికి బాధిత కుటుంబాలకు మేలు చేసే ఉద్దేశంతో 1.32 కోట్ల కుటుంబాలకు రూ. 750 కోట్లతో భీమా రక్షణ. ఈరెండేళ్లకాలంలోవైయస్సార్ బీమా కింద చేసిన ఖర్చు అక్షరాల రూ.1307 కోట్లు అన్నారు. ఏప్రిల్ 2020లో ఈ పథకం నుంచి తప్పుకున్న కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కన్వర్‌జెన్స్ స్కీం తీసేసి అర్హుల బ్యాంకు ఖాతాల ద్వారా బీమా చేయించాలనే ఆదేశాలు ఇచ్చింది. క్లెయిములు రావడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ సమయంలో అర్హులైన వారు కూడా బ్యాంకుల్లో ఎన్‌రోల్ కాకుండా కొంతమంది మిగిలిపోయారు. ఏ నెలలో జరిగితే.. అదే నెలలో క్లెయిములన్నింటినీ పరిష్కారించాలి. గ్రామ, వార్డు సచివాలయాలకు పూర్తి బాధ్యతలు అప్పగించాం. సమస్యలను పరిష్కరించడానికి 155214 టోల్‌ఫ్రీ నంబర్ అని పేర్కొన్నారు.