టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనతో ఏపీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు ఈ రోజు ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్య నేతలను హౌస్ అరెస్టులు చేసి, భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా టీడీపీ అధికార ప్రతినిధి పంచమూర్తి అనురాధ భావోద్వేగ వీడియో పోస్ట్ చేశారు.
ఈ వీడియో.. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక లా అండ్ అర్డర్ ఉందా చచ్చిపోయిందా అంటూ.. తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా టీడీపీ శ్రేణులకు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం చాలా బాధకరమైన విషయమన్నారు. డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న టీడీపీ కార్యాలయంపైనే దాడి చేస్తే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ను మరో ఆఫ్ఘనిస్తాన్ లా మార్చారని అనురాధ తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడి సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధికార ప్రతినిధి @AnuradhaTdp #YCPTerroristsAttack pic.twitter.com/Vr6y8NzwtV
— Telugu Desam Party (@JaiTDP) October 20, 2021