ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానది కరకట్ట పనులకు సీఎం వైఎస్ జగన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈరోజు ఉదయం కృష్ణాజిల్లా ఉండవల్లి కొండవీటి వాగు సమీపంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. కొండవీటి వాగు నుండి రాయపూడి వరకూ కరకట్ట విస్తరణ పనులు జరగనున్నాయి. 15 కిలోమీటర్ల పోడవున, 10 మీటర్ల వెడల్పుతో ఈ విస్తరణ ఉండబోతున్నది. ఈ విస్తరణ పనుల కోసం ప్రభుత్వం రూ.150 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు కృష్ణానది పొంగి పొర్లకుండా ఉండేందుకు కరకట్టను విస్తరిస్తున్నది ప్రభుత్వం.