ఏపీలో రాజకీయ దుమారం రేపిన టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మరో ఏడుగురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 16 మందిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. టీడీపీ కార్యాలయం ఘటనపై ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే.. చంద్రబాబు ఏపీకి సీబీఐ, కేంద్ర బలగాలు రావద్దంటూ ఉత్తర్వులు జారీ చేసి ఇప్పుడు ఎలా అడుగుతున్నారని వైసీపీ శ్రేణులు చురకలు అంటిస్తున్నారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి.