కోవిడ్ బాధిత కుటుంబాలకు జగన్ గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదిన్నరగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. కుటుంబాలు అల్లకల్లోలం అయ్యాయి. జీవానాధారం అయిన వారు కన్నుమూయడంతో సంపాదన లేక అల్లాడిపోయాయి లక్షలాది కుటుంబాలు. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురుచూశాయి కుటుంబాలు. కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది.
ఇందుకు సంబంధించి సెప్టెంబర్‌లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి కింద వీటిని అందజేయాలని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖలో కేంద్ర హోంశాఖ లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో దీనిపై స్పందించిన ఒడిశా ప్రభుత్వం.. కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం ఇస్తామని ప్రకటించింది. తాజాగా ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది.
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
కరోనా బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం సాయం చేస్తామని ప్రకటించింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ, భారత వైద్య పరిశోధనా మండలి నిర్ధేశించిన మార్గదర్శకాల ప్రకారం.. ధృవీకరించిన కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేల ఆర్థిక సహాయాన్ని అందజేసేలా చర్యలు చేపట్టనుంది. దేశంలో కరోనా వ్యాప్తి వెలుగు చూసినప్పటి నుంచి ఇప్పటివరకూ మరణించిన కేసులకే కాకుండా భవిష్యత్తులో కోవిడ్-19తో సంభవించే మరణాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఆదేశాలిచ్చింది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు రూ.50వేల పరిహారాన్ని అందించాలంటూ జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారక సంస్థసిఫార్సు చేసిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాకుండా కరోనా రోగులకు సేవలు అందిస్తూ వైరస్ బారినపడి మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందజేయనుంది. ప్రభుత్వం పరిహారం అందిస్తే కుటుంబాలకు ఆపన్న హస్తం అందించినట్టవుతుంది.
తాజావార్తలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
-
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
-
Trump-Jinping: జిన్‌పింగ్ టూర్ ఎఫెక్ట్.. రష్యా ఆంక్షల బిల్లు నుంచి చైనాకు మినహాయింపు!
-
Alia Bhat : రూటు మార్చేసిన భన్సాలీ ..స్లిట్ స్కర్ట్, మునుపెన్నడూ చూడని గ్లామర్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!