పీఆర్సీ అమలు, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఈ రోజు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో భేటీ అయ్యింది. ఈ నేపథ్యంలో పీఆర్సీ నివేదిక, ఫిట్‌మెంట్, ఉద్యోగ సమస్యల పరిష్కారంపై చర్చించింది. అయితే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల స్వీకరణ కోసం ప్రభుత్వ నోడల్ అధికారిని నియమించింది. దీనికోసం ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా ఉన్న ఆదినారాయణను నోడల్ అధికారిగా నియమించింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో నిర్ణయం మేరకు నోడల్ అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ…
పీఆర్‌సీపై నివేదిక ఇస్తేనే ఇండ్లకు వెళుతామని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెనుదిరిగారు. ఏపీ సెక్రటేరియల్‌లో సుమారు 5 గంటల పాటు నిరీక్షించిన ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వాపోయారు. రేపు ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని, కార్యచరణను రూపొందిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. 11వ పీఆర్‌సీపై రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.
సెక్రటేరియట్‌లో కొనసాగుతున్న ఉద్యోగ సంఘాల నేతల బైఠాయింపుసీఎస్ నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తోన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటు ఉద్యోగ సంఘాల నేతలు ఏపీ సెక్రటేరియట్‌లో బైఠాయించారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ నేత బండి శ్రీనివాస్‌రావు సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కుడి చేత్తో, ఎడం చేత్తో ఓట్లేసి జగన్ ను గెలిపించా మన్నారు. జగన్‌ను గెలిపించేందుకు మేం ఎంతో ప్రయత్నిం చామ న్నారు. లక్షల మంది ప్రతినిధులమైన మమ్మల్ని ఎందుకు…
ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న పీఆర్‌సీపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. పీఆర్‌సీపై కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే ఉద్యోగులు శుభవార్త వింటారని ఆయన వెల్లడించారు. దీనిపై సీఎం జగన్ మోహన్ రెడ్డితో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే పీఆర్‌సీపైన ప్రకటన చేయాలనుకున్నామని, కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయామన్నారు. త్వరలోనే పీఆర్‌సీపై గుడ్‌న్యూస్ ఉద్యోగులు వింటారని ఆయన అన్నారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఈ నెలలో…
ఏపీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవనున్నట్లు గవర్నర్ బిష్వభూషణ్ నోటిఫికేషన్ జారీ చేశారు. నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే 18న జరిగే బీఏసీ భేటీలో అసెంబ్లీ పని దినాలు, అజెండా ఖరారు కానున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఏపీ ప్రత్యేక హోదా లతో పాటు పలు కీలక…
ఇటీవల జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలిచారు. బద్వేల్‌లో గెలుపు అనంతరం మొదటి సారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరుకు బద్వేల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దాసరి సుధకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ఆమె వెంట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ…
ఉద్యోగుల జీతాలు ఒకటో తేదీన చెల్లించాలని ఒక చట్టం చేయా లని,జీతాల నుంచి ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. ఈ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తొలి బిల్లుగా ఒకటో తేదీకే జీతాల బిల్లును ప్రభు త్వం ప్రతిపాదించాలన్నారు. ఒకటో తేదీనే ఇవ్వకున్నా.. ఎప్పుడో ఒకప్పు డు ఉద్యోగులకు జీతాలిస్తున్నామన్న మంత్రి బుగ్గన వ్యాఖ్యలు చేయ డం సరైన పద్ధతి కాదని ఆయన…
వైద్య ఆరోగ్య శాఖ, నాడు–నేడు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటి వెలుగుతో పాటు ప్రాధాన్య కార్యక్రమాలపై క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా అధికారులను వివరాలు అడిగి తెలసుకోవడంతో పాటు పలు ఆదేశాలు ఇచ్చారు.వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,011 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం, ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయినట్టు అధికారులు తెలిపారు. పీహెచ్‌సీల్లో నాడు – నేడు కార్యక్రమాలు వేగంగా…
ఏపీలో ప్రస్తుతం ఎయిడెడ్ విద్యాసంస్థల ఇష్యూ నడుస్తోంది. ఎయిడెడ్ విద్యాసంస్థలను ప్రభుత్వం లాక్కొని విద్యార్థులపై భారం వేస్తోందంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ ఎయిడెడ్ విద్యా సంస్థల యాజమాన్య అసోసియేషన్ అధ్యక్షుడు ముత్తాబత్తుల రత్నాకుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎయిడెడ్ విద్యా సంస్థలను అప్పగించాలని ప్రభుత్వం మా పై ఎటువంటి బలవంతం చేయటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను నడపలేకపోతేనే ప్రభుత్వానికి అప్పగించమని అడిగారని, నడుపుకోగలుగుతున్న వారి పై…
ఢిల్లీలోని టీటీడీ దేవాలయం “స్థానిక సలహా మండలి” చైర్ పర్సన్‌గా వేద మంత్రాల ఆశీర్వచనంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో గోపూజ ప్రశాంతి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల విస్తరణ, సేవల విస్తరణ కోసం ఢిల్లీ “లోకల్ అడ్వైజరీ కమిటీ” పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఉత్తరాదిన ఢిల్లీ,…