సమైక్య రాష్ట్రంలో ఆరోజు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారు అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పనుల గురించి మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ దృష్టికి- కేంద్రం దృష్టికి తీసుకెళ్తాము. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల పై తెలంగాణ ప్రజలు ఉద్యమించే సమయం వస్తది అని తెలిపారు. సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడు ఆంధ్ర…
ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదం అని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈటల హిట్లర్ వారసుల వద్ద చేరి నియంతృత్వముపై పోరాడతా అంటున్నారు. ఆయన ముందే ప్రిపేర్ అయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈటల ఇంతకాలం చెప్పిన మాటలకు…చేతలకు పొంతన లేదు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం తీసుకువచ్చింది. ఇవి నల్ల చట్టాలు… రైతులను నడ్డివిరిచే చట్టాలు అని ఈటల అన్నారు. కానీ ఇప్పుడు ఆయన బీజేపీలో చేరి ప్రజలకు ఏ న్యాయం చేస్తారో చెప్పాలి. ఈటల…