Ram Setu: రామసేతు వంతెన నిజమే.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో..!
- భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు..
- నాసా ఉపగ్రహం ఐస్‌శాట్-2 సహాయంతో ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో..
- సోషల్ మీడియాలో రామ సేతు ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Setu: భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro) వెల్లడించింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలో మీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపంలోని తలైమన్నార్ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది అని నిర్ధారించారు. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ రామ సేతువు 99. 98 శాతం నీటిలో మునిగిందని సైంటిస్టులు చెప్పుకొచ్చారు.
Read Also: Pakistan : పాకిస్థాన్ లో మరో జర్నలిస్ట్ దారుణ హత్య.. దుండగులు బైక్ పై వచ్చి..
Also Read
అయితే, అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను ఇస్రో రెడీ చేశారు. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ల శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు సీతమ్మను అపహరించి.. ఆమెను అక్కడే దాచాడు.. హనుమంతుడు లంకాయాణం చేసి సీతమ్మ జాడను కనుగొని.. ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రంపై వానరసేన సహాయంతో వంతెనను నిర్మించినట్లు నానుడి. ఆ రామ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. అయితే, క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ‘సేతు బంధైగా పిలిచేవారు.. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ వంతెన 1480 వరకు తుఫానులతో పూర్తిగా ధ్వంసమైంది అని చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?