Gaganyaan Mission: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి భారత్ తొలి వ్యోమగామి..ఎప్పుడంటే..?
- అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు
- లోక్ సభలో మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి
- ఇది ఇస్రో.. నాసా..యాక్సియమ్ స్పేస్ ఉమ్మడి మిషన్
- గగన్‌యాన్ శిక్షణా కార్యక్రమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి వ్యోమగామిని పంపేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కి చెందిన గగన్‌యాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) ప్రయాణిస్తుందని ఆయన తెలియజేశారు. ఇది ఇస్రో(ISRO), నాసా (NASA), యాక్సియమ్ స్పేస్ (Axiom Space) అనే ప్రైవేట్ కంపెనీల మధ్య ఉమ్మడి మిషన్ అవుతుంది. ఈ మిషన్ కోసం ఆక్సియమ్ స్పేస్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మిషన్‌ను ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆగస్టు 2024లో ప్రారంభించవచ్చు.
READ MORE: Dog Meat Row: బెంగళూర్ హోటళ్లకు కుక్క మాంసం.. ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు..
Also Read
- Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
- Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
- Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
- 5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
ఆగస్ట్‌లో ‘గగన్యత్రి’ అంతరిక్ష యాత్ర..
నాసా, యాక్సియమ్ స్పేస్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాల్గవ ప్రైవేట్ వ్యోమగామి మిషన్ కోసం ఆర్డర్‌పై సంతకం చేసినట్లు ఇస్రో అధికారి తెలిపారు. ఇది ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఆగస్ట్ 2024లోపు ప్రయోగించే అవకాశం ఉంది. ఇస్రో బోర్డు ఈ నలుగురు పైలట్లను ఎంపిక చేసింది. వీరంతా రష్యాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన ప్రాథమిక మాడ్యూల్స్‌పై శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం వీరంతా గగన్‌యాన్ మిషన్ కోసం బెంగళూరులోని ఇస్రోకు చెందిన ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నారు. గగన్‌యాన్ శిక్షణా కార్యక్రమం మూడు సెమిస్టర్లలో రెండు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శిక్షణ కోసం అవసరమైన సిమ్యులేటర్‌లు, స్టాటిక్ మోకప్‌లు కూడా సిద్ధంగా ఉన్నాయి. మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లే రాకెట్‌లోని కొన్ని భాగాలు కూడా సిద్ధంగా ఉన్నాయి.. లోక్‌సభలో టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!