47 సంవత్సరాలలో తన మొట్టమొదటి చంద్ర ల్యాండింగ్ వ్యోమనౌకను ప్రయోగించడానికి రష్యా తన తుది సన్నాహాలు చేసింది. చంద్రుని దక్షిణ ధృవం మీద గణనీయమైన నీటి మంచు నిక్షేపాల ఉనికిని కనుగొనడానికి రష్యా 25 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
చంద్రయాన్-3 మిషన్ కీలకమైన మరో ఆపరేషన్‌ను సక్సెస్ ఫుల్ గా కాంప్లీట్ చేసింది. మరోమారు స్పేస్‌క్రాఫ్ట్ కక్ష్య విన్యాసానాన్ని 174 కిలో మీటర్ల బై 1437 కిలో మీటర్లకు తగ్గించినట్టు ఇస్రో ప్రకటించింది.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ పుల్ గా దూసుకుపోతుంది. అయితే, ఆదివారం చంద్రయాన్-3.. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను వీడియో తీసింది. దీంతో ఆ వీడియోను ఇస్రో ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. శనివారమే చంద్రుని లూనార్ కక్షలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మిషన్ ఆదివారం వీడియో చిత్రీకరించగా అందులో చంద్రుని ఉపరితలం మొత్తం.. నీలి ఆకుపచ్చ రంగులో కనిపించినట్లు తెలిపారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో కాసేపట్లో కీలక ఘట్టం చోటుచేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఈ మేరకు ఇస్రో కీలక ప్రకటన విడుదల చేసింది.