అయితే, చంద్రయాన్-3 రాకెట్ విజయవంతం కావడంతో పలువురు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేస్తున్నారు. తాజాగా.. ఈ ప్రయోగం విజయవంతంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. దేశ అంతరిక్ష చరిత్రలో చంద్రయాన్-3 కొత్త అధ్యాయాన్ని లిఖించింది అని ఆయన పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఆకాంక్షల్ని, కలల్ని ఇది నింగిలోకి మోసుకెళ్లింది.. మన శాస్త్రవేత్తల నిబద్ధతకు ఈ ప్రయోగమే నిదర్శనం అని ప్రధాని అన్నారు.
భారతదేశం గర్వించేలా చంద్రయాన్-3 రాకెట్ ను నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట నుంచి ఇవాళ (శుక్రవారం) మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
Chandrayaan-3: భారతదేశం మిషన్ మూన్ తమిళనాడుతో ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంది.. లాంచ్ వారి పర్యవేక్షణలో ఉంటుంది.2008లో మొదటి చంద్రుని మిషన్తో ప్రారంభమైన చంద్రయాన్ సిరీస్ గురించి ఒక ప్రత్యేకమైన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Chandrayaan-3: భారత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోట కేంద్రం నుంచి శుక్రవారం (జూలై 14) చంద్రయాన్ 3ని ప్రయోగించనున్నారు.
Chandrayaan-3: ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ నిర్వహిస్తున్న చంద్రయాన్-3 పైనే దృష్టిని కేంద్రీకరించాయి. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని దించేందుకు చంద్రయాన్-3 మిషన్ ని ఇస్రో చేపట్టింది. ఇది సాధ్యమైతే ఈ ఘటన సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలుస్తుంది.