Isro Chief Somanath: ఇస్రో చైర్మన్ సోమనాథ్‌కు గౌరవ డాక్టరేట్.. జేఎన్‌టీయూ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Isro Chief Somanath: చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇస్రో చీఫ్ శ్రీధర పనికర్ సోమనాథ్‌కు తెలంగాణ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. వర్సిటీ 12వ స్నాతకోత్సవం సందర్భంగా దీన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రొ.కట్టా నరసింహా రెడ్డి తెలిపారు. ఈ నెల 5న నిర్వహించనున్న స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, JNTU ఛాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారు అనంతరం డాక్టర్ సోమనాథ్ స్నాతక ప్రసంగం చేస్తారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 54 మంది విద్యార్థులు, పరిశోధకులకు బంగారు పతకాలు, డిగ్రీ పూర్తి చేసిన 88,226 మంది ఇంజినీరింగ్, ఎంటెక్ విద్యార్థులకు పట్టాలు అందజేయనున్నట్లు తెలిపారు.విదేశీ యూనివర్సిటీలతో ఒప్పందాలు. జేఎన్ టీయూలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు ఐదేళ్లలోపు డ్యూయల్ డిగ్రీ పొందేలా అమెరికా సహా ఇతర దేశాల్లోని పది యూనివర్సిటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వివరించారు.
Read also: Housing Sales: ఇళ్ల విక్రయాల్లో హైదరాబాద్ రికార్డు.. వాటికే ఫుల్ డిమాండ్..!
Also Read
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
జేఎన్‌టీయూలో మూడేళ్లు, విదేశీ యూనివర్సిటీల్లో రెండేళ్లు చదువుకునేలా ఈ ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సహకారంతో విత్తన కంపెనీల ఏర్పాటుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు UGC-మాలవ్య ఆచార్య శిక్షణా కేంద్రం ప్రారంభించబడింది. క్యాంపస్ నియామకాల్లో జేఎన్‌టీయూ విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారని వైస్ ఛాన్సలర్ అన్నారు. కొద్ది నెలల క్రితం 309 మందికి బహుళజాతి ఐటీ కంపెనీలు రూ. ఇక్కడ ఔత్సాహిక పారిశ్రామిక అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన హ్యాకథాన్‌లో పాల్గొన్న విద్యార్థులు తమ వినూత్న ఆలోచనలతో 73 ప్రాజెక్టులను రూపొందించగా, పరిశ్రమల స్థాపనకు 24 ప్రాజెక్టులను ఎంపిక చేసినట్లు వివరించారు.
Delhi AIIMS Fire: ఢిల్లీ ఎయిమ్స్ లో అగ్ని ప్రమాదం.. ఫర్నీచర్, ఆఫీసు రికార్డులు దగ్ధం
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!