గాజాను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ ముందుకు దూసుకుపోతుంది. ఇందులో భాగంగా దాడులను ఉధృతం చేసింది. సోమవారం గాజా ఆస్పత్రిపై భారీ వైమానిక దాడి జరిగింది.
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకరదాడులకు పాల్పడింది. 100 లక్ష్యాలను 200 యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ దాడి చేసింది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లలను ప్రయోగించింది. అయితే ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఇరాన్ డ్రోన్లను ఎదుర్కొన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన సైన్య ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ అన్నారు.
Israel Iran War: ఇజ్రాయిల్ ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’పేరుతో ఇరాన్‌పై భీకరమైన వైమానిక దాడులు చేస్తో్ంది. ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలు, అణు శాస్త్రవేత్తలు, ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం ఉదయం నుంచి విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇరాన్ మిలిటరీకి చెందిన ఉన్నతాధికారులు మరణించారు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణతో మరోసారి మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగాయి. Read Also: Air India plane crash: విమానం చివరి క్షణాల్లో పైలట్లు ఏం చేసి ఉండొచ్చు..?…
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసింది. ఇరాన్‌లో అత్యున్నత సైనికాధికారి మొహమ్మద్ బాఘేరి దుర్మరణం చెందారు. ఈ మేరకు ఇరాన్ మీడియా ధృవీకరించింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని అమెరికా హై అలర్ట్ చేసింది. ప్రస్తుతం ఇరాన్ అణ్వాయుధం కోసం పని చేస్తోంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్, టెహ్రాన్, టెల్ అవీవ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు గాజాపై విరుచుకుపడుతున్న ఐడీఎఫ్ దళాలు.. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బుధవారం షెజైయాలో జరిపిన దాడిలో 38 మంది చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. షెజైయాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పిల్లలు సహా కనీసం 29 మంది పాలస్తీనియన్లు మరణించారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు.