గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఏడాదికి పైగా ఐడీఎఫ్ దళాలు దాడులు సాగిస్తున్నాయి. క్రిస్మస్ రోజున కూడా ఇజ్రాయెల్ కొనసాగించింది. నుసిరత్‌లోని అల్-అవుడా ఆస్పత్రి పరిసరాల్లో జరిగిన దాడుల్లో అల్-కుద్స్ అల్-యూమ్ టెలివిజన్ ఛానెల్‌కు చెందిన ఐదుగురు జర్నలిస్టులు చనిపోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. టెలివిజన్‌కు చెందిన వ్యాన్‌లోని మంటలను సివిల్ డిఫెన్స్ సభ్యులు మంటలు ఆర్పారు.
ఇజ్రాయెల్ దాడిలో ఐదుగురు పాలస్తీనా జర్నలిస్టులు రాత్రిపూట మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెల్లవారుజామున తెలిపింది. మిలిటెంట్ల గుంపును లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జర్నలిస్టులు స్థానిక కుడ్స్ న్యూస్ నెట్‌వర్క్‌లో పని చేస్తున్నారు.
ఇక గాజాలో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఏడాదికిపైగా జరుగుతున్న యుద్ధంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. తీవ్ర ఆహార కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు ఉష్ణోగ్రతలు క్షీణించడం.. మరోవైపు ఆహారం, నీరు లేక ఇక్కట్లు పడుతున్నారు. స్వచ్చంధ సంస్థలు ఇచ్చే ఆహారంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఆహార పంపిణీ వాహనాలు రాగానే ప్రజలు దోపిడీ చేసుకుని ఎత్తుకుని వెళ్లిపోతున్నారు.
అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి బందీలుగా తీసుకెళ్లిపోయింది. ఆ నాటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. వందలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఏకధాటిగా యుద్ధం సాగుతోనూ ఉంది. త్వరలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ నాటికి యుద్ధం ముగియాలని హెచ్చరించారు. ఏమవుతుందో చూడాలి.