పశ్చిమాసియాలో ఇంకా యుద్ధం కొనసాగుతోంది. హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. తాజాగా జరిగిన దాడిలో 69 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
Hezbollah: హెజ్బుల్లాకు చెందిన మరో కీలక నేతను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజ్బుల్లా మీడియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహించే ప్రధాన ప్రతినిధి మహమ్మద్ అఫిఫ్ చనిపోయాడు.
ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. అయితే ఈ దాడి కేవలం క్షిపణుల దాడి మాత్రమే కాదు.. బదులుగా, ఈ క్షిపణులు 700-1000 కిలోల వార్‌హెడ్ పేలోడ్‌ను కలిగి ఉన్నాయి. ఇది మొత్తం భవనాన్ని నాశనం చేయగలదు. మన యుద్ధాల చరిత్రలో ఇది అపూర్వమని భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అన్నారు.
హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణం తర్వాత, ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్ రాజధాని బీరూట్‌లోని నివాస ప్రాంతాలపై కూడా దాడి చేస్తోంది. తొలిసారిగా బీరుట్‌లోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం. బీరుట్ శివారు ప్రాంతాలే కాకుండా, ఆదివారం సాయంత్రం నుంచి బీరుట్‌లో కూడా ఇజ్రాయెలీ డ్రోన్‌లు కనిపించాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకరయుద్ధం కొనసాగుతోంది. తాజాగా గాజాలోని పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 22 మంది మరణించారు. గాజా నగరంలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో కనీసం 22 మంది పాలస్తీనియన్లు మరణించారు. 30 మంది గాయపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Israel–Hamas war: గాజాలో ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తుంది. తాజాగా తూర్పు గాజాలో నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న ఓ స్కూల్‌పై దాడులు జరిపాయి ఇజ్రాయెల్ సేనలు. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం సాగిస్తోంది. ఇప్పటికే గాజాను సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సైన్యం.. యుద్ధాన్ని మాత్రం ఆపలేదు. శనివారం గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.