Benjamin Netanyahu on the way to a huge victory in the Israeli elections: ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు బెంజిమిన్ నెతన్యాహు. ఇజ్రాయిల్ కు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఆయన మరోసారి ఎన్నికల్లో విజయం సాధించనున్నారు. గురువారం అక్కడ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అయింది. 87.6 శాతం ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నెతన్యాహు లికుడ్ పార్టీ, దాని మిత్రపక్షాలు 65 స్థానాలు సాధించే స్థితికి చేరుకుంది.…
Benjamin Netanyahu as Prime Minister of Israel.. Exit polls revealed: ఇజ్రాయిల్ దేశంలో ఎన్నికలు ముగిశాయి. ఆ దేశ పార్లమెంట్ కనాసెట్ కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. గత నాలుగేళ్లలో ఇజ్రాయిల్ లో ఐదుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ సారి భారతదేశానికి మిత్రుడిగా, ప్రధాన మంత్రితో మంచి స్నేహం ఉన్న బెంజిమిన్ నెతన్యాహు తిరిగి అధికారంలోకి వస్తారని తెలుస్తోంది. అక్కడి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మంగళవారం ఎన్నిలక…
Australian Scientists Seek To Grow Plants On Moon By 2025: చంద్రులు భూమికి ఉన్న సహజ ఉపగ్రహం. భూమిపై జీవజాలానికి ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తోంది. అందుకే మనం ఉంటున్న భూమిని తల్లిగా.. చంద్రున్ని చందమామగా పిలుస్తుంటాం. భూమి కక్ష్యకు, భూమి స్థిరత్వానికి చంద్రుడు సహకరిస్తుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భూమిని ఓ టెలివిజన్ అనుకుంటే.. చంద్రుడు ఓ స్టెబిలైజర్ లాంటి వాడు. ఇంతలా భూమికి సహకరిస్తుంటాడు. ఒక వేళ చంద్రుడే లేకపోతే.. మనం…
Pakistan delegation on secret visit to Israel: ఉప్పు నిప్పుగా ఉండే పాకిస్తాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు చిగురించే అవకాశం కనిపిస్తోంది. ఓ ముస్లిం దేశంగా పాకిస్తాన్ మరో ముస్లిం దేశం అయిన పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ.. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ తో దౌత్యసంబంధాలను పెట్టుకోలేదు. అయితే ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో భారత చిరకాల మిత్రదేశం అయిన ఇజ్రాయిల్ తో పాకిస్తాన్ సంబంధాల కోసం ఉవ్విళ్లూరుతోంది.
BWF Championship 2022: వయసుతో ఆటకు సంబంధం లేదని మరోసారి రుజువైంది. ఇప్పటికే వయసు మళ్లిన వారు పలు క్రీడలలో రాణిస్తూ ఈ విషయాన్ని చాటిచెప్తున్నారు. తాజాగా ఓ మహిళ తన కుమారుడితో కలిసి చరిత్ర సృష్టించింది. టోక్యో వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్ 2022లో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.ఇజ్రాయెల్‌కు చెందిన స్వెత్లానా అనే 64 ఏళ్ల మహిళ బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. BWF చరిత్రలో ఓ…
Israel Attack On Gaza: పాలస్తీనా గాజా సిటీలోని మిలిటెంట్లు లక్ష్యంగా శుక్రవారం ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. ఆపరేషన్ ‘ బ్రేకింగ్ డాన్ ’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ హమాస్ లక్ష్యంగా దాడులను చేసింది. ఈ వారం ప్రారంభంలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో సీనియర్ మిలిటెంట్ ను ఇజ్రాయిల్ ఫోర్సెస్ అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి ఇటు పాలస్తీనా, ఇజ్రాయిల్ మధ్య ఘర్షణ వాతావరణ తలెత్తింది.
భారత్, ఇజ్రాయిల్, యూఎస్ఏ, యూఏఈ దేశాల కూటమి ఐ2యూ2 తొలి సమావేశం ఈ రోజు జరగనుంది. ప్రధాని మోదీతో పాటు ఇజ్రాయెల్ ప్రధాని యార్ లపిడ్, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, యూఎస్ఏ అధ్యక్షుడు జో బైడెన్లు వర్చువల్ గా సమావేశం కానున్నారు. ఈ నాలుగు దేశాల్లో మౌళిక సదుపాయాలను ఆదునీకరించడంతో పాటు ఆరు రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులు ప్రోత్సహించే విధంగా ప్రధాన చర్చ జరగనుంది. ఐ2యూ2 కూటమిని పశ్చిమాసియా దేశాల క్వాడ్…
‘ట్రిపుల్ ఆర్’లో యన్టీఆర్ దే పైచేయి! ఇది అభిమానులు అన్న మాటలు కాదు. సదా యుద్ధభయంతో సాగే ఇజ్రాయెల్ దేశంలోని మీడియా జై కొట్టిన వైనం! వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, ఇది అక్షరసత్యం! ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’ మార్చి 25న జనం ముందు నిలచింది. కోట్లయితే కొల్లగొట్టింది కానీ, చాలామంది అభిమానులకు ‘ట్రిపుల్ ఆర్’ నిరాశ కలిగించింది. “కొమురం భీముడో…” వంటి సూపర్ హిట్ సాంగ్ లో యన్టీఆర్ అభినయం జనాన్ని ఆకట్టుకుందని,…
తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్తగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు మరోసారి ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. బెన్ గురియోన్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడినట్లు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్లు BA.1, BA.2లను కొత్త వేరియంట్ కలిగి ఉన్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ సోకిన ఇద్దరు వ్యక్తులకు జ్వరం, తలనొప్పి, కండరాల బలహీనత వంటి…
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల కొరత ఏర్పడింది. కొన్ని దేశాలు మాత్రమే సెమీకండక్టర్లను తయారు చేస్తున్నాయి. దీంతో భారీగా డిమాండ్ పెరిగింది. కరోనా మహమ్మారి కాలంలో ట్రాన్స్‌ఫోర్ట్ ఫెసిలిటీ తగ్గిపోవడంతో ఈ కొరత ఏర్పడింది. అంతేకాదు, పరిశ్రమలను మూసివేయడం కూడా ఇందుకు ఒక కారణం. ఈ కొరత తగ్గి తిరిగి యధాస్థితికి రావాలి అంటే చాలా కాలం పడుతుంది. చాలా దేశాలు సొంతంగా ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కొన్ని సంస్థలు సెమీకండక్టర్లు తయారు చేస్తున్న…