ట్రంప్ వ్యాఖ్యలను తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశం అయ్యే ఆలోచన మాకు లేదని వెల్లడించారు.
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. సంఘర్షణ తర్వాత తన తొలి బహిరంగ ప్రసంగంలో ఖమేనీ గురువారం మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌పై తాము విజయం సాధించామని, ఇజ్రాయిల్‌ని కాపాడాలని అండగా వచ్చిన అమెరికా ముఖంపై చెంప దెబ్బ కొట్టామని అన్నారు. ఇరాన్ అణు స్థావరాలకు పెద్దగా నష్టం జరగలేదని, అమెరికా పెద్దగా ఏం సాధించలేకపోయిందని చెప్పారు.
విదేశీ ముఠాలు లేదా మోసాద్ లాంటి గూఢచార సంస్థలు ఆయనపై దాడికి సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అలీ ఖమేనీ మరో దేశానికి తాత్కాలికంగా వెళ్లి తలదాచుకోవాలని యోచిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదికలో పేర్కొంది.
Donald Trump: ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెదర్లాండ్స్‌లో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇజ్రాయిల్, ఇరాన్‌లు ‘‘పాఠశాలల్లోని ఇద్దరు పిల్లలు’’ అని అభివర్ణించారు. ఇటీవల, కాల్పుల విరమణ తర్వాత కూడా ఇరు దేశాలు మిస్సైల్ దాడులు జరుపుకోవడంపై డొనాల్డ్ ట్రంప్ లైవ్ టీవీలో ‘‘ఎఫ్-వర్డ్’’ వాడటం ఆన్లైన్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Iran: 12 రోజులు పాటు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో సంఘర్షణ నెలకొంది. ‘‘ఆపరేషన్ రైజింగ్ లయన్’’ పేరుతో ఇజ్రాయిల్, ఇరాన్ అణు కార్యక్రమాలపై దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తల్ని, టాప్ మిలిటరీ జనరల్స్‌ని ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హతమార్చింది. అయితే, దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయిల్‌పై వందలాది క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకోవడంతో మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుతం శాంతి వాతావరణం నెలకొంది. మంగళవారం నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందించారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపగలిగినందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
Iran-Israel War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత రెండు దేశాలు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ అయ్యారు. రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం ఉందని.. సైనికులను వెనక్కి రప్పించాలంటూ ఇజ్రాయెల్ ను ఆదేశించారు. దీంతో దాడులు చేసినట్టు ఒప్పుకున్న ఇజ్రాయెల్.. తమ అధినేత నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడిన తర్వాత దాడులు ఆపేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. Read Also : Rammohan…
గత కొన్ని రోజులుగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న పరస్పర దాడులతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీంతో అంతా సద్దుమణుగుతుందని అందరూ భావించారు. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇరాన్ తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. సీస్ఫైర్ అమలులోకి వచ్చిన 2 గంటలకే ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించారని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్)…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ట్రంప్ ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది.